దక్షిణ కాశిగా , హరిహర క్షేత్రంగా , నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా వాసికెక్కిన సాంప్రదాయాల సిరియైన ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శ్రీయోగా నంద, ఉగ్ర నారసింహ , శ్రీవేంకటేశ్వర స్వాముల తెప్పోత్సవ, డోలో త్సవాలు మార్చి 18,19,20వ తేదీలలో శుక్ర, శని, ఆది వారాలలో వరుసగా జరుగ నున్నాయి. ధర్మ పురి పట్టణ నడి బొడ్డున వెలసి విశేష పౌరాణిక, చారిత్రిక, ఐతి హాసిక ప్రాధాన్యతను కలిగిన, దక్షిణ భారతావనిలోనే అతిపెద్దదిగా భావించబడే బ్రహ్మ పుష్కరిణి (కోనేరు )లో మూడు రోజులు పగలు మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది వరకు నిర్వహించే కార్యక్రమాలలో స్వాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేక ప్రత్యేక నిర్మిత బల్లకట్టుపై ఆశీనుల గావించి, కోనేటి నీటిపై ఐదు ప్రదక్షిణలు గావించడం అనా దీగా క్షేత్రంలో ఆచరిస్తున్న సత్సాంప్రదాయం. హిరణ్య కశిపుని సంహారానంతరం, ఉగ్రనారసింహుని శాంతింప జేసేందుకు బ్రహ్మాది దేవతలు తపో , యజ్ఞ ధ్యానాది సత్కర్మల నొనరించిన నేపథ్యంలో, బ్రహ్మ తన మంత్ర దండంతో ఈ క్షేత్రంలో భూమిన త్రవ్వి కుండమును నిర్మించి, అందలి జలమున స్నానమాడి, శ్రీనృసింహుని గురించి తపమొనరించి, అనుగ్రహం పొంది ఆ దేవదేవుని మందిరాన వసింపుమని వరం పొందడం జరిగిం దని, బ్రహ్మ దేవుడు స్నానమాచరించిన స్థలానికే “బ్రహ్మ పుష్కరిణి”, యని పేరు వచ్చినదని పృథు మహారాజుకు నారదమునీం ద్రుడు వివరించి నట్లు నైమిశా రణ్యంలో శౌనకాది మహర్షులకు సూత పౌరాణికులు చెప్పినట్లు స్కంద, బ్రహ్మాండ పురాణ అంతర్గత క్షేత్ర మహాత్మ్యం ప్రాచీన గ్రంథాలు విశదీకరిస్తున్నాయి. సంతాన హీనుడైన లక్ష్మణుడను బోయరాజు, నారద మునీంద్రుని ద్వారా నారసింహ మంత్రో పదేశం గావింపబడి, ఆ మంత్ర జప బల ముచే పుత్ర ప్రాప్తి నొందెనని, అయితే లక్ష్మణునకు ధర్మపురి క్షేత్రంలో నిద్రించిన సమయంలో స్వప్నమందు శ్రీనృసింహుడు దర్శనమిచ్చి బ్రహ్మ పుష్కరిణికి నలు వైపులా సోపానాలు , మధ్య బాగాన వేదికను, శ్వేత వరాహ తీర్థం నుండి కోనేరు లోనికి జలము వచ్చు మార్గమును నిర్మింపుమని ఆజ్ఞాపించెను అని, భగవదా దేశానుసారం, ఆ ఎరుకల రాజు అన్నియూ నిర్మించి, అందులకై అయిన ఖర్చును రాసి పెట్టెనని, ఫలితంగా నృసింహుడు ఆగ్రహించి పుష్కరిణికి రానని ప్రకటించి, తిరిగి లక్ష్మణుని ప్రార్థన పై, ప్రతి సంవత్సరం పాలుణ శుక్ల పూర్ణిమనాడు, విహారార్థం సుముఖుడనై ఏతెంచ గలనని వరమిచ్చినట్లు పురాణాలు స్పష్ట పరుస్తున్నాయి. ఉదయగిరి సీమను ఏలిన రాయలదండులో కరీంనగరం మండలం లోనికి ప్రవేశించిన జూపరల్లి సంతతిలో ని వాడగు జూపల్లి ధర్మా రాయుడు , తన నాటికేయున్న బ్రహ్మపుప్కరిణి నలువైపులా సోపానాలను, మధ్యలో వేదికను నిర్మింప జేసెనని, తరువాత శాలివాహన శకం 1566 పార్థివ సంవత్సరంలో (క్రీ.శ.1645 ) చింతల నరుస బోయని కుమారుడగు తిరుమలయ పుష్కరిణి చుట్టూ ప్రాకారం మధ్య వేదికపై భోగ మండపం నిర్మింప జేసి దీపారాధనలతో , ఓడలోన మహోత్సవముతో శ్రీనృసింహుని కొలిచెనని పుష్కరిణిలోని శాసనం ద్వారా తెలుస్తున్నది. ఇంతటి పౌరాణిక, చారిత్రిక నేపథ్యం కలిగిన స్వామివారి కోనేరులో స్థానిక దైవాల తెప్పోత్సవ, డోలోత్సవాల నిర్వహణకై దేవసానం సకల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నది. ఈఓ శ్రీనివాస్, ఇందారపు రామయ్య నేతృత్వంలోని అభివృద్ది కమిటీ సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటినుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES