జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలో త్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పో త్సవ, డోలోత్సవాల సందర్భంగా, దేవస్థానం ఏసీ, ఈఓ సంకటాల శ్రీనివాస్ ఆద్వర్యంలో, దేవస్థాన అభివృద్ది కమిటీ అధ్యక్షుడు రామన్న సభ్యుల పర్యవేక్షణలో, యాజ్ఞికులు కందాల పురుషోత్తమా చార్య, వేద పండితులు రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, ఉప ప్రధానా ర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్య, ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్య, రమణాచార్య, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మీ నారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంట లకు శ్రీయోగానంద నారసింహ ప్రధానా ఆలయం నుండి వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో భక్తజనం తోడురాగా, నారసింహుని ఉత్సవ మూర్తులను బ్రహ్మ పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా కొని తెచ్చారు. అనంతరం ప్రత్యేక నూతన బహూ కృత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించగా భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచిన భక్తులు పూజా ద్రవ్యాలు సమర్పించి కైమోడ్పులిడి తన్మయులైనారు. హంస వాహనంపై క్షేత్ర చరిత్రలో ప్రప్రథమంగా ఒక ఎమ్మెల్యే, అంతేకాక రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ప్రదక్షిణాలలో పాల్గొనడం విశేషం.
తరువాత బ్రహ్మపుష్కరిణి మధ్య వేదికపై గల భోగ మంటపములో గల ఊయలలో స్వామిని ఆసీనుల జేసి డోలోత్సవాన్ని జరపగా భక్తులు జయజయ ధ్వనాలతో ప్రార్ధించా రు. ఉత్తర ద్వారంగుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా, ఇరుకైన మార్గం గుండా లోనికి వెళ్ళి కట్న కానుకలను సమర్పించి దర్శనాలు చేసుకున్నారు. రాత్రి 9గంటల వరకూ కార్యక్రమం కొనసాగింది. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిన సందర్భంగా జగిత్యాల ఎస్పీ సింధు శర్మ మార్గదర్శకత్వంలో, ధర్మపురి సీ ఐ కోటేశ్వర్ పర్యవేక్షణలో,
పలువురు సబ్ ఇన్స్ పెక్టర్లు, డివిజన్ లోని పెద్ద మొత్తంలో ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డు లతో పాటు సెక్షన్ల ప్రత్యేక ఆర్మ్డ్ పోర్స్ తో ఎలాంటి అవాంఛనీయాలు చోటు
చేసు కోకుండా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, ధర్మపురి జెడ్పీటీసీ అరుణ, బుగ్గవరం జెడ్పీటీసీ రాజేందర్, మార్కెట్ మాజీ చైర్మన్ రాజేశ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా యోగానందుని తెప్పోత్సవం
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి