నిరంతర అభివృద్ది కాముకులు సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి ఫలితంగా కోట్లాది నిధులతో ధర్మపురి క్షేత్రం, దేవస్థానం అభివృద్ది దిశలో పయని స్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ధర్మపురి క్షేత్రంలో కోనేటిలో తెప్పోత్సవ డోలోత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, 2.5 కోట్లతో బ్రహ్మ పుష్కరిణి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జాతర ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయన్నారు. భోజనాలు, వసతి, త్రాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం తదితర భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను ప్రశంసించారు.
కోట్లాది నిధులతో ధర్మపురి అభివృద్ది
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి