5.1 C
New York
Tuesday, March 21, 2023
HomeNewsరథోత్సవానికి భారీ ఏర్పాట్లు

రథోత్సవానికి భారీ ఏర్పాట్లు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం నిర్వహించ నున్నందున అధిక మవుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం, మున్సిపల్, ఇతర సంబంధిత అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవ, తెప్పోత్సవ, డోలోత్సవాది కార్యక్రమాలు, ఉత్తర, దక్షిణ దిగ్యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకుని, వేద సదస్యం, భోగమంటపం, సంగీత సభలను ముగించుకున్న శ్రీనృసింహుడు, సకలాభరణ శోభితయై వెలుగొందుచున్న లక్ష్మీదేవితో కూడి, తమ ఏకాంత మందిరాన నిద్రించుచున్న సమయాన, గుర్తు తెలియని వ్యక్తులెవరో దొంగ చాటున ప్రవేశించి మహాలక్ష్మి నగలన్నీ దోచుకుని వెళతారు. తెల్లవారి నిద్రలేచి జరిగిన విషయాన్ని లక్ష్మీదేవి ద్వారా గ్రహించిన నారసింహుడు, కైలాస గిరీశుడైన అభయం కరుడు శంకరుడు, కలియుగ దైవమైన వేంకటేశ్వ రుడు తోడురాగా, రథారూఢులై బయలుదేరి దొంగలను కనుగొని, వారిని బంధించి దిగ్విజయంగా తిరిగి రావడం పురి క్షేత్ర రథోత్సవ ప్రత్యేకత. అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయాచరణలో భాగంగా దేవస్థాన ప్రాంగణాన గల, దివంగత ధర్మపురి దానకర్ణులు దివంగతులైన కోరిడె సదాశివు రాంబాయమ్మ దంపతులు ప్రత్యేకించి తయారు చేయించి దేవస్థానానికి బహూకరించిన లక్ష్మీనర సింహ, శ్రీరామలింగేశ్వర, రాష్ట్ర మాజీ మంత్రి కర్నె వెంకట కేశవుల హయంలో దేవస్థానం తయారు చేయించిన వేంకటేశ్వర స్వాముల రథాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కోవిద్ నివారణ చర్యలలో గత సంవత్సరం రథోత్సవం ఊరేగింపు రద్దు చేయబడగా, ఈ ఏడు తిరిగి నిర్వహిస్తున్న క్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు రథో త్సవంలో భాగస్వాములు కానున్నందున సౌకర్యాలు, వసతులు కల్పనపై దృష్టి పెట్టి వివిధ శాఖల పక్షాన ఏర్పా ట్లను చేశారు. జగిత్యాలతోపాటు ఆసి ఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, మెట్పల్లి, కామారెడ్డి, భైంసా, వరంగల్, కరీంనగర్ డిపోల నుండి ప్రత్యేక జాతర బస్సులను నడుపుతున్నారు.

మొక్కులు తీర్చుకున్న భక్తులు…
దైవ దర్శనాలకు వేచి ఉన్న భక్తజనం

ధర్మపరి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా మంగళ వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర ఉత్తర, దక్షిణ దిగ్యా త్రల సందర్భంగా వంశపారంపర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలు మూలలనుండేశాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాల నుండి ఏతెంచిన భక్తజన దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూదా ముళ్ళీ వెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను ఆర్పించి, దానధర్మా దులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. ప్రధానంగా కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ముడుపులు చెల్లించుకున్నారు.
.
సంప్రదాయ రీతిలో వేద సదస్యం

దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై రాత్రి సాంప్రదాయ రీతిలో వేద సదస్యం నిర్వహించారు. యోగానంద, ఉగ్ర నరసింహ, వేంకటేశ్వర బ్రహ్మో తృవాలలో భాగంగా కల్యాణం, విహారం, ఉత్తర, దక్షిణ దిగ్మాత్రం రంగ మండపంలో ఏటా వేద పండితులచే వేద సదస్సును నిర్వహించడం ఆనవాయితీ. రుక్, యజుర్, సామ, ఆధర్వణ వేదాలచే దైవారాధన చేయడానికి నిర్ణయించిన క్రమంలో క్షేత్ర వేద పండితులు, అర్చకులే కాక, లబ్ధప్రతిష్ఠులైన స్థానిక వేదవిదులు అపురూపంగా, అరుదుగా ఒకే వేదికపై ఆసన్నులై, వేద సదస్సు నిర్వహించారు. అధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.

అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ

ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని ఎవి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.

ఆకట్టుకున్న గయోపాఖ్యానం పౌరాణిక నాటకం

బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దేవస్థానం పక్షాన నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల సందర్భం గా దేవస్థానంలో ని శేషప్ప కళా వేదికపై, ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి నాట్య మండలి వారిచే నిర్వహించబడిన గయో పాఖ్యానం పౌరాణిక సాంప్రదాయక పద్య నాటకం ఆకట్టుకున్నది.

రొట్టె గుండయ్య దర్శకత్వంలో మునిగ్యాల కిషన్ సమర్థవంతంగా నిర్వహించిన లబ్ధ ప్రతిష్టు లైన నటుల వైవిధ్య భరిత రాగాలతో, హావభావాలతో, సాటిరాని నటనతో ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల గావించింది. నటన సూత్రధారి శ్రీకృష్ణుడిగా డాక్టర్ సంగన భట్ల నరసయ్య, అర్జును డిగా కోరిడే నరహరి శర్మ గయుడి గా పాలేపు చంద్రమౌళి, నారదు డిగా చిన్న రామ కిష్టయ్య,
ధర్మరాజుగా కాకర్ల దత్తాత్రి, అక్రూరునిగా కాసర్ల వెంకటరమణ, బలరాముడిగా జననంచి నరసయ్య, సాత్యకిగా బుగ్గారపు నరహరి, పుష్పదంతుడుగా బుగ్గారాపు కిషోర్ , కౌశికుడుగా కాకెరి అనిల్ కుమార్, శంకరుడి గా కషోజ్జల శేఖర్ రాయబారిగా, ఇందారపు రాం కిషన్ , సుభద్రగా సంగనభట్ల ప్రతిభ, సంగీతం కొంటి కర్ల రామయ్య శర్మ, దర్శకత్వం రొట్టె గుండయ్య , ఎస్ రామకృష్ణయ్య, ఎస్ కిషన్, సంతోష్ కుమార్ సహాయకులుగా ముత్యాల సురేష్, కాకెరి అమర్, పెండ్యాల మహేం దర్, వంశీకృష్ణలు సేవలం దించారు.
తెలంగాణ లోనే మెట్టమెదటి నాటక సంస్థయై, పౌరాణిక నాటకాలకు పెట్టింది పేరుగా నిలిచియున్న ధర్మపురి నాట్య మండలి సాంప్రదాయక పద్య నాటకం పాతతరం నటుల ప్రదర్శనలను మరో మారు జ్ఞప్తికి తెచ్చింది. సెట్టింగులు, మేకప్ ప్రశా పాత్రమైంది. రాత్రి 10 గంటల నుండి మూడు గంటలకు పైగా సాగిన నాటకాన్ని చూసిన పాతతరం నటులు, యువ నటుల నటనలను కౌశలాన్ని వేనో పొగిడారు. తమ పేరును నిలబెడు తున్నారని శాఘించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments