5.1 C
New York
Saturday, March 25, 2023
HomeNewsకన్నుల పండువగా ధర్మపురీశుల కళ్యాణం

కన్నుల పండువగా ధర్మపురీశుల కళ్యాణం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ధర్మపురి మార్చి 15 ప్రజా మంటలు: దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్పష్టమై నదిగా, రాష్ట్రంలో పేరెన్నికగన్న గోదావరీ తీరస్థ పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, మంగళ వారం రాత్రి శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ వేంకటేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవోపేతంగా, కన్నుల పండువగా జరిగాయి. స్థానిక దైవాల బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన మువ్వురు ఇలవేలుపుల కళ్యాణోత్సవాల సందర్భంగా అర్చకులు నంబి శ్రీనివాసా చార్య గృహానికి వేంచేసిన స్వాములకు ప్రత్యేక పూజలొ నరించారు. సాయంత్రం గోధూళి శుభ ముహూర్తంలో సర్వాంగ శోభితంగా తీర్చి దిద్దిన నూతన నిర్మిత కళ్యాణ వేదికయైన దేవస్థానంలోని శేషప్ప కళా వేదికపైకి ఆలయాలనుండి స్వాముల ఉత్సవ మూర్తులను వేదమంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాలతో భక్తజనం తోడురాగా కొని తెచ్చి ఆసీనుల గావించారు.

సాంప్రదాయ రీతిలో యజ్ఞోప వీత ధారణ, రక్షా గోత్రనామ ప్రవరలు, కన్యాదానం, మంగళా ష్టకములు, గూడజీర ధారణ, అక్షతారో పణాది కార్యక్రమాలను విధి విధానంగా నిర్వహిం చారు. సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబం పక్షాన ఆయన సతీమణి స్నేహలతా ఈశ్వర్, ప్రభుత్వ పక్షాన కలెక్టర్ రవి పురపాలక సంఘం పక్షాన మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, కమిషనర్ రమేశ్, కౌన్సిలర్లు సిబ్బంది, తదితరులు వేరువేరుగా స్వాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, కట్నకానుకలను సమర్పించారు. చిల్వా కోడూరుకు చెందిన గందె సుదర్శనరావు వెంగళాపురం గందె ధర్మారావు, కాంతారావు, గుళ్ళ కోటకు చెందిన గంపుల లక్ష్మీ నర సింహారావు కుటుంబీకులు దైవ కళ్యాణానికి తలంబ్రాలు, మట్టెలు, మంగళ సూత్రాలను వంశపారం పర్య ఆచార నేపథ్యంలో కానుకలుగా సమర్పించారు.

దేవస్థానం ఎసిఈఓ శ్రీనివాస్, రామయ్య నేతృత్వంలోని అభివృద్ది కమిటీ సభ్యుల పర్యవేక్షణలో యజ్ఞాచార్యులు పురుషోత్తమా చార్య, వేద పండితులు రమేష్ శర్మ, సంబంధిత అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణోత్సవానికి అశేష భక్తులు హాజరైనారు. ప్రత్యేక టికెట్లు తీసుకుని వేలాది మంది కళ్యాణ కార్యక్రమా లలో ప్రత్యక్ష భాగస్వాములైనారు. భక్తులు వేదిక ముందు ఆసీనులై తిలకించారు. రాత్రి 10 గంటల వరకూ కళ్యాణ కార్యక్రమం కొనసాగగా, రాష్ట్రంలో వేరెచ్చటను లేని విధంగా క్షేత్ర ప్రాచీన ఆచార నేపథ్యంలో, రాత్రి 10 గంటలకు ప్రధానాలయాలలో మూల విరాట్టులకు కళ్యాణం జరిపించారు. శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణికులు బాచంపెల్లి సంతోష్ శాస్త్రి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకట్టుకుంది. కలెక్టర్ రవి, అడిషనల్ జాయింట్ కలెక్టర్ లత, ఆర్డీఓ మాధురి, మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ రామయ్య, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ అరుణ, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు కార్యక్రమాలలో భాగస్వాము లైనారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు, డీఎస్పీ ప్రకాశ్, సి ఐ కోటేశ్వర్ మార్గదర్శకత్వంలో, ధర్మపురి ఎస్ ఎస్ కిరణ్ ఆధ్వర్యంలో భారీ ప్రత్యేక పోలీసు బృందాలు ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులను ప్రత్యేక క్యూల ద్వారా వేదిక వద్దకు పంపారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments