5.1 C
New York
Wednesday, March 29, 2023
Homespecial Editionబ్రహ్మ పుష్కరిణిలో...కోనేటి రాయుని జలవిహారం

బ్రహ్మ పుష్కరిణిలో…కోనేటి రాయుని జలవిహారం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండిధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆదివారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. సాయంత్రం ఐదు గంటలకు ముందుగా ప్రధానాలయంనుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి, మంగళవాద్యాలు, వేదమంత్రాల.యుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మిత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగాన గల భోగమంట పంలోని ఊయలలో స్వామిని ఆసీనులచేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలు, తదితర కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నేరేళ్ళ శ్రీనివా సాచార్య, శ్రీధరాచార్య, విజయ్, మోహనాచార్య, కిరణ్ తదితరులు నిర్వహించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, దేవస్థాన అభివృద్ది కమిటీ సభ్యులు చైర్మన్, తదితరులు కార్యక్రమాలకు హాజరైనారు.

మొక్కులు తీర్చుకున్న భక్తులు

క బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆదివారం నిర్వహిం చిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెం చిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూటా ముళ్ళే నెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, దానధర్మాదులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

హోమశాలలో ప్రత్యేక పూజలు

శ్రీ వేంకటేశ్వర తెప్పోత్సవ, డోలోత్సవ నిర్వ హణదినమైన ఆదివారం దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మో త్సవ పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య యాజ్ఞికులు, దేవతా పౌరోహితులు కందాళై పురుశోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మల ఆధ్వర్యంలో, అర్చకులు నేరేళ్ళ శ్రీధరాచార్య, శ్రీనివాసాచార్య, మోహనా చార్య, కిరణ్, వంశీ, విజయ్ ఉదయం నుండి యాగశాలకు స్వాముల ఉత్సవ మూర్తులను వేంచేపుచేసి, బ్రహ్మకలశ పూజ, ధ్వజారోహణము, తిరుక్కళ్యాణం, నిత్య హోమ పంటపంలో కలశ, విశ్వక్సేన, కర్మణః, పుణ్యావాచనం, అగ్నిద్యానం, వాసుదేవ, నారాయణ మంత్ర హవనం, సమిద్ద హోమం, పంచసూక్త హవనాలు, ద్వాదశ దేవతా హోమాలు, సప్తావరణ హోమాలు, అష్టమంగళ, మూర్తి, సుదర్శన, విశ్సక్సేన, సర్వదేవతా, గరుడ హవనాలు, మూల మంత్ర హోమాలు, స్థాపిత దేవతా హవనములు, దోష పరి హారార్ధం నవగ్రహ, నక్షత్ర హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం బలి ప్రదానం, అష్ట దిక్పాలకుల ధ్వజారో హణం, గరుడ బ్రహ్మలకు బలిప్రదానం గావించగా, భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొని, కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లించు కున్నారు. దేవస్థానం పక్షాన భక్తులందరికీ ఉచిత అన్నదానం గావించారు. స్థానిక ఆర్యవైశ్యులు, చైతన్య భారతి విద్యా నికేతన్, పాఠశాల విద్యార్థులు స్వచ్చంద సేవకులుగా సేవలందించి, భక్తుల, యాత్రికుల ప్రశంసాపాత్మలైనారు. దేవస్థానం ఈ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సిబ్బంది, స్వచ్చంద సంఘాల బాధ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

అవధులు దాటిన ఆనందం..

బ్రహ్మోత్సవాలలో భాగంగా,యోగానంద, ఉగ్ర నరసింహుల దక్షిథ దిగ్యాత్రలో అంతర్భాగంగా, ఆదివారం సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన కార్యక్రమాలలో పోలీసులు ఆనందం అవధులు దాటింది. సాయంత్రం ఇరువురు స్వాములను తమ స్టేషన్ కు ఆహ్వానించడానికి దేవస్థానానికి డీఎస్పీ ప్రకాశ్, సిఐ కోటేశ్వర్, ఎస్ ఐ కిరణ్, పలువురు ఎస్ ఐలు దేవస్థానంలో ఉత్సవ మూర్తుల పూజలో పాల్గొన్న అనంతరం సాంప్రదాయ ఊరేగింపు ప్రారంభమైంది. ఆకాశం మేఘావృతమై ఉండగా, పరిస్థితిని గమనిస్తూ, విగ్రహ కూడలి ద్వారా ఊరేగింపులో పోలీసులు ఆనందంలో మెల్లగా నృత్యాలు ప్రారంభించారు. సాంప్రదాయ బాజా బజంత్రీలు, బ్యాండు మేళాలు, డీజే ధ్వనులు, ఒగ్గుడోలు వాద్యాలతో కళాకారుల విన్యాసాలతో సాగిన ఊరేగింపులో స్థానిక అధికారులు, పోలీసులు వీరావేశాలతో నేపథ్య సంగీతంతో స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఊరేగింపు సేవలు స్టేషన్ ఆవరణకు చేరడానికి చాలా సమయం పట్టింది.


రక్షకభట కార్యాలయంలో లక్ష్మీనారసింహుడు


నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో, వివిధ పార్టీల నేతలో, పోలీ సుల కుటుంబ సభ్యులో… రక్షకభట కార్యాలయ ప్రాంగణంలో తిరుగాడడం సర్వసాధారణమే అయినా… సాక్షాత్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీలక్ష్మీనృసింహుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడు బ్రహ్మో త్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేషనుకు వెళ్ళి విశేష పూజలందు కోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈ కార్యక్ర మంలో భాగంగా సాయంత్రం దేవస్థానం నుండి మున్సిపల్ కార్యాలయం, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్ స్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారి మీదుగా, బాజా భజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా యోగ, ఉగ్ర స్వాముల ఉత్సవ మూర్తులను బ్యాండు మేళాలతో, సాంప్రదాయ నృత్యంతో కళాకారుల విన్యాసాలతో, ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రూపేష్, జగిత్యాల డీఎస్సీ ప్రకాశ్, మెట్పెల్లి డీ ఎస్పీ రవీంద్ర రెడ్డి, ధర్మ పురి సిఐ కోటేశ్వర్, ధర్మపురి ఎస్ ఐ కిరణ్ దంపతులు, ఇతర ఎస్ ఐ లు, ఎస్ఎస్ఐలు, సిబ్బంది ఊరేగింపులో పాల్గొని నడిచి వెళ్ళి, స్టేషన్ వద్దకు రాగానే ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానిం చారు. పోలీస్ అధికారులు సేవలను భుజాలపై పెట్టుకుని నడిచారు. తమ వద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని సిఐలు, ఎస్ఐలే కాక, భక్తులు, పోలీసులు కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతిం చారు.
స్టేషన్ ప్రాంగణాన ప్రత్యేక నిర్మిత వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనుల జేసి ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశశర్మ, ముత్యాల శర్మ, అర్చక పురోహి తులు సంతోష్ శర్మ, సంపత్ కుమార్ శర్మ, అర్చకులు, తది తరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు వేద మంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. హారతు లిచ్చారు. స్వామి, అమ్మ వారలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పోలీసులు కుటుంబ సభ్యులేగాక, ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందు కున్నారు. పోలీసుల ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మాలలో పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలో గల ఉద్యోగులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్వామిని దర్శించిన వారందరికీ స్వామి ప్రసాదంగా పులిహోర, మిఠాయిలు పెంచారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments