5.1 C
New York
Wednesday, March 29, 2023
Homespecial Editionఅవధులు దాటిన భక్తి పారవశ్యం

అవధులు దాటిన భక్తి పారవశ్యం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో ఉత్కృష్ట మైన రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా, గోదావరి తీరస్థ పవిత్ర తీర్థంగా పేరెన్నికగన్న ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నర సింహ (ఉగ్ర, యోగానంద, శ్రీ వెంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ధర్మపురి పట్టణంలో భక్తి పారవశ్యం అవధులు దాటింది. “తడి బట్ట స్నానాలయ్యో నరసయ్యా, నీ గుళ్ళో పూజలయ్యో, చంకనా బాలాలయ్యో నరసయ్యా, నెత్తిమీద ముళ్ళాలివిగో; గండి దాటి మేమొస్తిమో నరసయ్యా, గట్టెక్కించి మమ్ము దోలవో” అంటూ జానపద బాణీలలో రాష్ట్రేతర ప్రాంతాల నుండి ఏతెంచిన భక్తుల భగవన్నామ స్మరణలతో, గీతాలా పనలతో క్షేత్రం మారు మోగింది. ఔరంగాబాద్, చంద్రాపూర్, నాందేడ్ లాంటి సుదూర ప్రాంతాల నుండి ప్రత్యేక మరియు ఆర్టీసి బస్సులలో ప్రాచీన వంశ పారంపర్య ఆచార క్రమంలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, దర్శనార్థం ఆలయాల ముందు వేచి నిలుచున్నారు. ప్రధానాలయాలలో పంచోపనిషత్ యుక్త ప్రత్యేక పూజలు, నిత్య కళ్యాణ, ప్రత్యేక పూజలు దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ, ముత్యాల శర్మ అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నేరేళ్ల శ్రీనివాసా చార్య, నరసింహ మూర్తి, రమణాచార్య, అశ్విన్, వంశీ, విజయ్, కిరణ్, ఆస్థాన పౌరోహితులు కందాల పురుషోత్తమా చార్య, సంబంధిత ఆలయాల అర్చకులు, దేవ స్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్, రామయ్య నేతృత్వంలోని అభివృద్ది కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. ముఖ్యంగా కోరిన కోర్కెలు తీర్చే ప్రధాన దైవమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ ఏకాంత ఉత్సవ సందర్భంగా మూల విరాట్టులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

దేవస్థానంలో మెక్కులు తీర్చుకున్న భక్తులు

బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా గురువారం వంశపారంపర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుండేకాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఎతెంచిన భక్త జనం దేవస్థానంలో మెక్కులు తీర్చుకున్నారు. రథోత్సవ అనంతరం నిర్వహించే స్వాముల ఏకాంతోత్సవ వేడుకలలో భాగస్వాములు కావడం సనాతన సాంప్రదాచారణ కాగా, సుదూర ప్రాంతాలనుండి ఎలా సాంప్రదాయాలను ఆచరిస్తున్న భక్తులు పిల్లా పాపలతో గోదావరి నదికి మూటా ముళ్ళే నెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, దాన ధర్నాదులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. ప్రధానంగా నారసింహ ప్రధానాలయంలో కోడె మెక్కులు, గండా దీపం, పట్టినామాలు, కోరమీసాలు తదితర మెక్కులు తీర్చుకుని, స్వామి సన్నిధిలో తమ కోర్కెలు తీరా లని ముడుపులు కట్టారు.

గోదావరిలో ఘనంగా చక్ర తీర్థం

శ్రీయోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి గోదావరి నదిలో స్వామి వారల చక్రతీర్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మువ్వురు స్థానిక దైవాల రథాలను ప్రధాన రహదారి గుండా నంది విగ్రహ చౌరస్తా వరకు ఊరేగింపు జరిపిన అనంతరం రాత్రి 8.30 గంటలకు మంగళ వాద్యాలు, వేద మంత్రాల మధ్య స్వాముల ఉత్సవ విగ్రహాలను గోదావరి నది పైభాగం వరకు భక్త జనం తోడురాగా తీసుకవెళ్ళి నదినీటి సమీపాన ఆసీనుల గావించారు. అవభృత స్నానాలు ఆచరించిన అనంతరం స్వాములకు షోడశో పచార పుజలు గావించారు. స్వాముల పాదాలు స్పృశించిన నదీజలాలను భక్తులపై సంప్రోక్షణగా వించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ , కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, దేవస్థాన వంశ పారంపర్య యాజ్ఞికులు కందా లై పురుషోత్తమాచార్య, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, వివిధ ఆలయాల అర్చకులు, వేద పండితులు, దేవస్తాన అభివృద్ది కమిటీ బాధ్యులు, సిబ్బంది, భక్తులు యేడాదికో సారి మాత్రమే రథోత్సవం నాటి రాత్రి నిర్వహించే ఆపురూప కార్యక్రమంలో భాగస్వాములైనారు. ఆ తర్వాత సాంప్రదాయా చణ ప్రకారం మధ్వాచారి పవన్ కుమార్ గృహంలో పూజలందుకుని, రాత్రి విందు భోజనం ఆరగించి, ఊరేగింపుగా దేవస్థానానికి తిరిగి వచ్చిన అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని నిర్వహించి, దైవాలను కీర్తించారు. సంతాన ఫలాపేక్ష గలిగిన వారికి మాల ధారణగా వించారు. ఎస్ ఐ కిరణ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

ఆకట్టుకున్న సంగీత విభావరి

బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దేవస్థానం పక్షాన నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా రాత్రి దేవస్థానంలోని శేషప్ప కళా వేదికపై, ధర్మపురి క్షేత్రానికి చెందిన ఆకాశవాణి, టీవి గాయకులు గుండి జగదీశ్ శర్మ, ప్రఖ్యాత గాయని కవితా ప్రసాద్ లచే నిర్వహించ బడిన సంగీత విభావరి ఆకట్టుకుంది. వాద్య సహకారంతో అలవోకగా చేసిన గానం రసజులైనా శ్రోతలను రంజింప జేసింది. ప్రధానంగా త్యాగరాజ కృతులు, అన్నమయ్య కీర్తనలు, సినీ భక్తిరస ప్రధాన తదితర పాటలు రంగీతజ్ఞులను పరవశుల చేశాయి.

దేవస్థానానికి గణనీయ ఆదాయం

బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానానికి గణనీయ ఆదాయం చేకూరింది. ఈ నెల 14నుండి 23 వరకు 10రోజులకు గాను వివిధ టికెట్ల ద్వారా 19,00,762 రూపాయలు, ప్రసాదాల ద్వారా 21,52,860 రూపాయలు, అన్నదానం ద్వారా 6,52,766 రూపాయలు మొత్తం 47,06,388 రూపాయల ఆదాయం లభించింది. గత సంవత్సరం వివిధ టికెట్ల ద్వారా 14,33,437 రూపాయలు, ప్రసాదాల ద్వారా 13,48,477 రూపాయలు, అన్న దానం ద్వారా 3,61,313 రూపాయ లు మొత్తం 31,43,227 రూపాయ లు లభించాయి. ఈ ఏడు 15,63,161 రూపాయలు అదనపు ఆదాయం సమకూరినట్లు ఏ సీ ఈ ఓ శ్రీనివాస్ సంక టాల తెలిపారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments