దక్షిణ కాశీగా, నవ నారసింహ క్షేత్రాలలో ఉత్కృష్ట మైనదిగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రైమూర్త్య నిలయంగా గోదావరి తీరాన వెలసియున్న తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో 14-03-2022 నుండి 26-03-2022 వరకు 13 రోజుల పాటు జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ వెంకటేశ్వర స్వామి వారల వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, గారు జిల్లా కలెక్టర్ రవి గుగులోత్, ఆదేశములు, సూచనలను పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పర్యవేక్షణలో బ్రహ్మోత్సవముల సందర్భముగా దేవాలయము లోపల వెలుపల, అన్ని వసతి అవసరమైన చోట్ల రంగులు/సున్నాలు వేయించడం జరుగుచున్నది.
భక్తుల సౌకర్యార్థం దేవాలయము లోసల వెలుపల ప్రత్యేక క్యూలైన్స్, కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాతల సహకారంతో దేవాలయం లోపల ఆవరణలో నీడ కోసం రేకుల షెడ్లు, కూర్చోవడానికి వీలుగా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది.
భక్తుల సౌకర్యార్థం దేవాలయము లోపల, వెలుపల, గోదావరి నది తీరములో తడుకలతో చలువ పందిర్లు, స్త్రీలు బట్టలు మార్చు కోవడానికి వీలుగా ప్రస్తుతము గల శాశ్వత డ్రెస్స్ చెంజింగ్ రూమ్స్ తో పాటు ఆధనముగా తడుకలతో డ్రెస్సింగ్ రూములు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
బ్రహ్మోత్సవాలు విస్తృత ప్రచారం నిమిత్తం పూర్వపు ఉమ్మడి జిల్లాలు అయిన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పాటు మహారాష్ట్రలోని చాందేడ్ జిల్లాలకు వాల్ పాస్టర్లు, కరపత్రములు మరియు ప్రధాన రహదారులలో జాతర ఫ్లెక్సిలు, దేవాలయ మునకు, గోదావరి నదికి సూచించే సైన్ బోర్డులను, ఫ్లెక్సి బ్యానర్లు ఏర్పాటు చేసి భక్తులకు తెలియ పర్చుటకు చర్యలు గైకొనబడు తున్నవి.
మంత్రి ఈశ్వర్ సూచనల ప్రకారం గత సంవత్సరము కంటే రెండు రాజగోపురములకు, దేవాలయ ములకు, ఆర్చలకు అదనముగా విద్యుత్ దీపాలం కరణ, లైటింగ్ బోర్డులు, లైటింగ్ వేయించడానికి చర్యలు తీసు కుంటున్నారు. గతములో కంటే ఈ సంవత్సరము అదన ముగా పూల అలంకరణ, ప్రధాన దేవాలయములతో పాటు అనుబం ద ఆలయములకు అలంకరణ, కళ్యాణోత్సవ వేదిక ప్రత్యేక అలంకరణ, బ్రహ్మ పుష్కరిణి, ఇతర అవసర మైన ప్రదేశములలో అలంకరణ చేయడానికి చర్యలు గైకొన బడుచున్నవి.
భక్తుల సౌకర్యార్థం దేవస్థానము పక్షాన, స్వచ్ఛంద సంస్థలు మరియు దాతల సహాకారంతో దేవాలయం – లోపల, వెలుపల, గోదావరినది తీరములో, ఇతర చోట్ల మంచి నీటి చలివేంద్రముల ఏర్పాటు చేయుటతో పాటు శ్రీస్వామి వారి దర్శనార్థం వచ్చు భక్తులకు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మరియు విజయ డైరీ వారి సహకారంతో చల్లటి మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు వితరణ చేయడానికి చర్యలు గైకొన బడుచున్నవి. బ్రహ్మోత్స వముల సందర్భముగా క్షేత్రానికి విచ్చేయు భక్తులకు భోజన వసతి టి.టి.డి ధర్మశాలలో స్థానిక ప్రజాప్రతి నిధులు, ఆర్యవైశ్య, వర్తక సంఘం, రైస్మిల్లర్స్, దాతలు, స్వచ్చంద సంస్థలు, గ్రామస్తుల సహాకారంలో ఉచిత అన్నదానం చేయడానికి చర్యలు గైకొన బడుచున్నవి. కోవిడ్-19 నిబంధనల మేరకు ప్రతినిత్యం దేవాలయం లోపల, వెలుపల సానిటైజేషన్, సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయించడంతో పాటు ప్రతి భక్తుడు మాస్కు దరించి దర్శనం చేసుకొనే వీలుగా ఏర్పాట్లు చేయడానికి చర్యలు గైకొన బడుచున్నవి.
భక్తుల సౌకర్యార్ధం ఈ సంవత్సరం లక్ష లడ్డు ప్రసాదం, 25 క్వింటాల్ల పులిహోర ప్రసారం తయారు చేయించి భక్తులకు విక్రయిం చడానికి వీలు కల్పిస్తున్నారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ ద్వారా
స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గార్లతో జాతర ఏర్పాట్లను ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యము వాటిల్ల కుండా తక్షణ చర్యలు గైకొనుటకు సమన్వయంతో జాతరను నిర్వి ఘ్నముగా జరుపుకొనుటకు చర్యలు గైకొనబడుతున్నవి.