పవిత్ర గోదావరి నదీ తీరస్థ పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రం మంగళ వారం భక్తి పారశ్యంతో పొంగి పోయింది. క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభించి తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రి ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ సాంప్రదా యాచరణలో భాగంగా విచ్చేసిన భక్త, యాత్రిక జనం భగవన్నామ స్మరణలతో, జయజయ ధ్వనాలతో క్షేత్రం ప్రతిధ్వనించింది. ముఖ్యంగా పావు మండల దీక్షాపరులైన హన్మాన్ భక్తుల భక్తి పారవశ్యం ఆవధులు దాటి ఆలౌ కిక ఆనందాన్ని ఆస్వాదింప జేసింది. ఉదయా త్పూర్వం నుండే దూర ప్రాంతాల నుండి ప్రయివేటు వాహనాలు, బస్సులలో క్షేత్రానికి చేరుకున్న భక్తులు, పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించి, ప్రధానా లయాల ముందు బారులుతీరి వేచి ఉండి దైవ దర్శనాలు చేసు కున్నారు. విశేషించి దేవస్థానం లోని ప్రసన్నాంజనేయ మందిర ప్రాంగణాన నిర్వహి చిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఒద్దిపర్తి నర్సింహమూర్తి, కళ్యాణ్ ఆధ్వర్యంలో హన్మాన్ భక్తులు మాలధారణం, మంత్రోపదేశాలను పొందారు. ఇది వరకే దీక్ష బూనిన, మంగళవారం దీక్షలు స్వీకరించిన హన్మాన్ దీక్షాపరులైన భక్తులతో ఆంజనేయ ఆలయం కిటకిట లాడింది. ఇటీవలి కాలంలో ధర్మపురి దేవస్థానంలో సాంప్రదాయ రీతిలో హన్మాన్ దీక్షలను స్వీకరిస్తున్న క్రమంలో, పెద్ద సంఖ్యలో భక్తులు 11రోజుల ప్రత్యేక హన్మాన్ పావు మండల దీక్షలను స్వీకరించిన భక్తులు ఉదయాత్పూర్వంనుండి పవిత్ర గోదా వరి నదిలో మంగళ స్నానాలను ఆచరించి, పునీతులై, శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానాంతర్గత ప్రసన్నాంజనేయ ఆలయంముందు దైవదర్శనార్ధం బారులుతీరి వేచి ఉన్నారు. భక్తులకు దేవస్థాన ఈఓ పర్యవేక్షణలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నరసింహ మూర్తి, కళ్యాణ్ ఆధ్వర్యంలో అంజనీ తనయునికి ప్రత్యేక అభిషేకాలు, నిత్యవిధి పూజలు, అర్చనలు గావించారు. వంద లాది మంది హన్మాన్ దీక్షాపరులైన భక్తులు ప్రత్యేక దైవ పూజాదులలో భాగస్వాములైనారు.
శ్రీరామాలయంలో నవరాత్రి పూజలు
పరమ పవిత్ర గోదావరీ తీరస్థ ధర్మపురి క్షేత్రంలో నదీ తీరాన వెలసిన అత్యంత ప్రాచీన శ్రీరామాలయంలో చైత్ర శుద్ధ ఉగాది మొదలు కుని, శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజలపాటు నిర్వహించ నున్న రామ నవరాత్రి ఉత్సవ వేడుకలలో భాగంగా నాలుగవ రోజైన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వా భిముఖులైయున్న సీతారామ ఏకశిలా విగ్రహం, ప్రభపై దశావతా రాలు కలిగి, ఛత్రధారిగా భరతుడు, వింజామరవీస్తూ శతృజ్ఞుడు,
అనంత పద్మనాభస్వామి, వేంకటేశ్వర శివ పంచాయ తనాలతో శోభిల్లుతున్న ప్రాచీన దేవాలయంలో సాంప్రదాయ వేదోక్త రీతిలో ఉదయాత్పూర్వం ఆలయ సంప్రోక్షణ గావించారు. ఆలయ వంశపారం పర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బాలచంద్రశర్మ, బలరామశర్మ, రఘునాథశర్మ, వామన శర్మ, రామశర్మ ఆధ్వర్యంలో వేదవిదులు మధు శంకర శర్మ, కొరిడే విశ్వనాథ శర్మల మంత్రోచ్ఛాటనల మధ్య అభిషేకాలు, పంచోపనిషత్ యుక్త షోడశోపచార పూజలు నిర్వహిం చారు. భక్తులకు దైవాశీస్సులం దించి, తీర్థ ప్రసాద వితరణ గావించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494