5.1 C
New York
Saturday, March 25, 2023
HomeLifestyleDevotionalఈ సంవత్సరం ధనస్సు రాశి ఫలితాలు ….

ఈ సంవత్సరం ధనస్సు రాశి ఫలితాలు ….

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

సజ్జన సహకారం.ధైర్యం వృద్ధి, సామాజిక సంబంధాలలో గౌరవ ము.తండ్రి గారి గౌరవం, పూర్వ పుణ్యాల పెంపొందించుకునే కార్యక్రమాలు నిర్వహిస్తారు. సామర్థ్యం తో అనుకున్న కార్యక్రమాలు నిర్వహణ.నూతన గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు సత్ఫలితాలు.విద్యార్థులకి విద్యాభివృద్ధి, నూతన విషయాలు గ్రహణ.అనుకోని ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో కొంత శ్రమ పడవలసివస్తుంది,రోగనిరోధక శక్తి వల్ల ఆరోగ్యం పొందగలుగుతారు. వృత్తిలో గౌరవం బాధ్యత పెరిగి గౌరవ సన్మానాలు,వృత్తిలో ప్రమోషన్ల కి అభివృద్ధికి అవకాశం ఉంది. దానధర్మాలు సత్ఫలితాలు , స్థానచలనం కొరకు ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు జరుగుతున్నప్పటికీ సద్వినియోగం అవుతాయి. సేవకజన సహకారముతో విజయాలు సాధిస్తారు. వారి శ్రమ తో మీరు సాధించిన విజయములు కనుక వారి శ్రమ ని గుర్తించి తగిన సహకారం వారికి అందించుట ద్వారా మీకు ఆ సహకారములు వారితో కొనసాగుతాయి. ప్రయాణములు చేస్తారు అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఇంతవరకూ చాలా కాలంగా వాయిదా పడిన పనులు సులభంగా ముందుకు సాగుతాయి. సంతాన వర్గం విషయంలో కొంత శ్రద్ధ చూపించాలి. సంతానం దురలవాట్లకు లోనుకాకుండా పర్యవేక్షణలో ఉంచడం మంచిది. హాస్టల్స్ మొదలైన దూరంగా పెట్టి చదివించడం మంచిది కాదు. తండ్రి గాని తండ్రి వర్గంలో బంధువులకు గాని అనారోగ్యమునకు అవకాశమున్న రీత్యా తగిన శ్రద్ధ తీసుకోవాలి. అసంతృప్తిని అధిగమించడానికి పుణ్యఫలం పెంచుకోవాలి. విదేశీ ప్రయత్నములు ఇబ్బందులు కలిగిస్తాయి. మధ్యవర్తులను ఈ విషయంలో నమ్మకూడదు, మోసపోయే అవకాశం ఉంది. కొనుగోలు విషయంలో కొత్త వ్యక్తులు మోసము చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాలలో ప్రయోజనాలు సిద్ధిస్తాయి కానీ వాటిని ప్రధానముగా భావించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments