5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeEntertainmentMovie Updates“దేవినేని” ఏ నాయకుడికి సంబంధించిన కథ కాదు...డైరెక్టర్ నర్రా శివనాగు

“దేవినేని” ఏ నాయకుడికి సంబంధించిన కథ కాదు…డైరెక్టర్ నర్రా శివనాగు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

వంగవీటి అభిమానుల గాని దేవినేని అభిమానులు గాని ఎవరినీ డ్యామేజ్ చేసే విధంగా సినిమా లో ఎక్కడ చూపించలేదు.ఒకసారి మీరు సినిమా చూడండి. సినిమాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు తెలపండి వెంటనే వాటిని కరెక్షన్ చేస్తాము అంటున్నాడు దర్శకుడు నర్రా శివనాగు..ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి తారకరత్న హీరోగా వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటీ,నటులుగా బెజవాడలో ఇద్దరు మహా నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ కలయికలో  నర్రా శివనాగు ద‌ర్శ‌క‌త్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దేవినేని’ దీనికి ”బెజవాడ సింహం” అనేది ట్యాగ్ లైన్ ఈ సినిమాపై వస్తున్న రూమర్లపై అందరికీ క్లారిటీ ఇవ్వాలని ఇదివరకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది.అయినా ఇంకా కొంతమంది నాయకులు ఫోన్స్ చేసి ఇబ్బంది పెడుతున్న సంధర్బంగా

 చిత్ర దర్శకుడు నర్రా శివ నాగు మాట్లాడుతూ… ఇది దేవినేని నెహ్రూ (బెజవాడ) ఒరిజినల్ బయోపిక్ కానే కాదు. డైరెక్టర్ గా, కథకుడిగా తను ఊహించి రాసుకున్న కథే అని చెబుతున్నారు దర్శకుడు నర్రా శివనాగు. ఎలక్ట్రానిక్ & సోషల్ మీడియా ద్వారా ఏ నాయకుడికి సంబంధించిన కథ కాదనీ ఇది ఒక కమర్షియల్ ఫార్ములా కథ అనీ చిత్ర దర్శకుడు క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఆవేదన వ్యక్తం చేసినా కూడా ఆంధ్ర ప్రదేశ్ నుండి కొంతమంది నాయకులు రకరకాలుగా ఇబ్బంది కరమైన ఫోన్లు చెయ్యడం వాట్సాప్ మెస్సేజ్ లు పంపించి దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. “దేవినేని” సినిమా వల్ల ఏ రాజకీయ నాయకులకు ఎలాంటి డామేజ్ కలగదనీ, ఏ నాయకులకు తమ రాజకీయ జీవితాలకు ఈ “దేవినేని” మూవీ డామేజ్ చేయదనీ దర్శకుడు నర్రా శివనాగు ఇంతకు ముందే మీడియా ముఖంగా వివరించడం జరిగింది.

   ఇది బయోపిక్ సినిమా అని పత్రికల వాళ్లు రాస్తున్నారు. ఇది బయోపిక్ కాదు, దయచేసి గమనించగలరు.కోర్ట్ ద్వారా ఫైట్ చేస్తామనీ, ఎంత దూరమైనా వెళ్తామనీ లేటెస్ట్ గా కొన్ని వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయి. బ్రదర్ దయచేసి మీరు ఏవేవో ఊహించుకోకండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుణ్ని కించపరచే విధంగా గానీ డామేజ్ చేసే విధంగా కానీ “దేవినేని” మూవీ ఉండదు. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ మాత్రమే.

    ఫిలిం చాంబర్స్ “దేవినేని” టైటిల్ ని సర్టిఫై చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ (సెంట్రల్ గవర్నమెంట్) ఈ చిత్రాన్ని చూసి U/A  సర్టిఫికెట్ జారీ చేసింది. “దేవినేని” చిత్రంలో నటించిన హీరో కూడా నందమూరి ఫ్యామిలీలో ఒక పెద్ద హీరోనే.  దర్శకుడు కూడా ఎంతో అనుభవంతో ఎన్నో చిత్రాలు చేసి ప్రజాదరణ పొందిన దర్శకుడే.

   ఈ “దేవినేని” చిత్రం ఏ నాయకుణ్ని డామేజ్ చేసే విధంగా ఉండదని మరొక్క సారి మనవి చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

 నటీనటులు

నందమూరి తారకరత్న , సురేష్ కొండేటి, ధ్రువతార,
బెనర్జీ తుమ్మల ప్రసన్న కుమార్, సంగీత దర్శకుడు కోటి,తుమ్మల పల్లి రామ సత్యనారాయణ ,బాక్స్ ఆఫీస్ చందు రమేష్,లక్ష్మీ నివాస్, లక్ష్మీ నరసింహ తదితరులు

 సాంకేతిక నిపుణులు
ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్
నిర్మాతలు :-జిఎస్ఆర్, రాము రాథోడ్
డైరెక్టర్ :-నర్రా శివనాగు
లిరిక్ రైటర్ :- మల్లిక్,
పి ఆర్ ఓ.:- మధు వి.ఆర్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments