5.1 C
New York
Sunday, April 2, 2023
Homespecial Editionదేవికా రాణి

దేవికా రాణి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


దేవికా రాణి (మార్చి 30, 1908 – మార్చి 9, 1994) సుప్రసిద్ధ సినీ నటి. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గ్రహీత.


ఆమె విశాఖ పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి భారత దేశపు తొలి సర్జన్ జనరల్ కల్నల్ ఎం.ఎన్.చౌదరి. శాంతి నికేతన్లో విద్యాభ్యాసం తర్వాత ఉపకార వేతనం మీద లండన్ వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్, మ్యూజిక్లో సంగీతం, నటనలో శిక్షణ పొందారు.

జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరుపొందిన హిమాంశు రాయ్ తో పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి 1929లో పెళ్ళి చేసు కున్నారు. బెర్లిన్ లోని యు.ఎఫ్.ఎ. స్టూడియోలో దేవికని చేర్పించి మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలైన విభాగాల్లో శిక్షణ ఇప్పించారు.

స్వదేశానికి తిరిగివచ్చి స్వంతంగా “కర్మ” (1933) అనే చిత్రాన్ని నిర్మించారు. దేవికారాణి నాయికగా, హిమాంశురాయ్ నాయకునిగా దీనిని హిందీలోకి అనువదించి విడుదల చేయగా ఘనవిజయం సాధించింది.

1934లో “బాంబే టాకీస్” అనే సంస్థను స్థాపించి ఎందరో ఔత్సాహిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణ నిచ్చారు. బాంబే టాకీస్ తీసిన చిత్రాలలో దేవికారాణి, అశోక్ కుమార్ ల జంట హిట్ పెయిర్ గా పేరు పొందారు. ఈమె నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మక మైనవి. సమాజ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా అచూత్ కన్య (1936) లో, తల్లి కాలేని గృహిణిగా నిర్మల (1939) లో, అనాథగా దుర్గ (1939), తిరగబడిన మహిళగా సావిత్రి (1937) లో విధివంచితు రాలైన బ్రాహ్మణ యువతిగా జీవన్ ప్రభాత్ (1937) లో ఆమె నటన అనితర సాధ్యమైనది.

1940 మే 19లో హిమాంశు రాయ్ హఠాన్మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత ఆమె చేతిలో పడింది. తర్వాత తీసిన బసంత్, కిస్మత్, అంజానా మొదలైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టాయి.

తర్వాత బాంబే టాకీస్ స్టుడియోను దర్శించడానికి వచ్చిన సుప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు స్వెతస్లోవ్ రోరిక్ (Svetoslav Roerich) తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి 1945లో వివాహానికి దారితీసింది. తర్వాత ఆమె సినీరంగానికి దూరమయ్యారు.



ఆమె సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1958లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నెలకొల్పిన తొలిసారి ఆమెకు 1969లో ప్రకటించారు. చివరి రోజుల్లో బెంగుళూరులో గడుపుతూ 1994 మార్చి 9 తేదీన పరమ పదించారు.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments