Wednesday, November 30, 2022
Homespecial Editionవెండి తెర వెన్నెల రాణి దేవికా రాణి

వెండి తెర వెన్నెల రాణి దేవికా రాణి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

రూప లావణ్యం, అద్భుత నటనా చాతుర్యం, అద్వితీయ అందం కలగలిపిన నాటి మేటి సినీ నటి దేవికా రాణి. ఆడపిల్లలు సినిమాలలో నటించడం తప్పుగా భావించే నాటి రోజులలోనే సినిమాలలో నటించిన భారతీయ తెర ప్రథమ మహిళ ఆమె. ఆమె తొలి సినిమా నటి, నిర్మాత, స్టూడియో అధినేత్రి. సినిమా నటన, నిర్మాణం, డిజైనింగ్, మేకప్ మొదలయిన శాఖలలో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళ. నాటి రోజుల్లో లండన్ వెళ్ళి ఆర్కిటెక్చర్, టెక్స్టైల్స్, డెకరేషన్ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారామె.
దేవికా రాణి (మార్చి 30, 1908 – మార్చి 9, 1994) సుప్రసిద్ధ సినీ నటి. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గ్రహీత. నటిగా, నిర్మాత గా భారతీయ చిత్ర పరిశ్రమలో ఆమె చేసిన పాత్ర మరువలేనిది. స్వాతంత్ర్యానికి ముందు మహిళా మార్గదర్శకుల్లో ఆమె ఒకరు. భారతీయ తెర ప్రథమ మహిళ (ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా)గా గుర్తింపు పొందిన నటి. వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. దేవికా రాణి తన భర్త హిమాన్షు రాయ్‌తో కలిసి 1943లో బాంబే టాకీస్‌ను స్థాపించారు. ఇది భారత దేశంలోని మొట్ట మొదటి సుసంప న్నమైన స్టూడియోలలో ఒకటి. 1933లో భారతీయ సినిమాలో మొట్ట మొదటి ఆంగ్ల భాషా టాకీగా తీసిన ‘కర్మ’ సినిమాలో హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుని సంచలనం సృష్టించిన తొలి తరం సంచలన డేరింగ్ నేటి.

ఈమె 1908 మార్చి 30వ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీ, నేటి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు లీలా చౌధురి, కల్నల్ మన్మథ్నాథ్ చౌధురిలు. వీరు నోబెల్ బహుమతి గ్రహీత, గురుదేవ్ రవీంద్రునికి దగ్గరి బంధువులు, విద్యావంతులకు నిలయమైన సంపన్న జమీందారీ కుటుంబం వీరిది. భారతదేశం లోను, మద్రాసు ప్రెసిడెన్సీలోను తొలి సర్జన్ జనరల్ కల్నల్ చౌధురి.

8 ఏళ్ళ వరకు బాల్యపు విద్యాభ్యాసాన్ని శాంతినికేతన్లో సాగించారు. 9 ఏళ్ళ వయస్సులోనే శాంతి నికేతన్లో విద్యాభ్యాసం తర్వాత ఉపకార వేతనం మీద లండన్ వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్, మ్యూజిక్లో సంగీతం, నటన లో శిక్షణ పొందారు.1920 నాటికి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె తన బాల్యంలో ఎక్కువ భాగం లండన్‌లో గడిపారు, అక్కడ ఆమె నటన, సంగీతం, వాస్తుశిల్పం అభ్యసించారు.రాయల్ అకాడమీ ఆఫ్ డ్రైమొటిక్ ఆర్ట్స్, రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ లో చేరారు. వివిధ కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని, నైపుణ్యతను సంపాదించారు. ఇవే తరువాత కాలంలో సినిమా రంగంలోని వివిధ రంగాలలో ఈమెని అత్యున్నత స్థాయిలో నిలిపాయి. ఆమె టెక్స్‌టైల్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించగా, హిమాన్షు రాయ్, న్యాయవాదిగా మారిన చలనచిత్ర నిర్మాతను కలుసుకున్న తర్వాత ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది.

జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరు పొందిన హిమాంశు రాయ్ తో పరిచయం ఏర్పడి తర్వాత అది ప్రేమగా మారి 1929లో పెళ్ళి చేసు కున్నారు. ఆమె చిత్ర నిర్మాణం విషయంలో నేర్చుకోవడానికి బెర్లిన్‌కు వెళ్లి, బెర్లిన్ లోని యు.ఎఫ్.ఎ. స్టూడియోలో మేక ప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ మొదలైన విభాగాల్లో శిక్షణ పొందారు.

స్వదేశానికి తిరిగివచ్చి స్వంతంగా “కర్మ” (1933) అనే ఆంగ్ల చిత్రాన్ని నిర్మించారు. దేవికారాణి నాయికగా, హిమాంశు రాయ్ నాయకునిగా దీనిని హిందీలోకి అనువదించి విడుదల చేసారు కూడా.

1934లో “బాంబే టాకీస్” అనే సంస్థను స్థాపించి ఎందరో ఔత్సా హిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణ నిచ్చారు. దేవికా రాణి కూడా భారతీయ సినిమాకు మధుబాల, ముంతాజ్, దిలీప్ కుమార్ వంటి అమూల్యమైన రత్నాలను అందించిన నిర్మాత. బాంబే టాకీస్ తీసిన చిత్రాలలో దేవికా రాణి, అశోక్ కుమార్ ల జంట హిట్ పెయిర్ గా పేరు పొందారు. వారు మొదటగా జీవన్ నయ్యా (1936)లో కలిసి నటించారు. అశోక్ కుమార్, దేవికా రాణి తరచుగా దేశభక్తి జన్మభూమి (1936), ప్రేమకథ ఇజ్జత్ (1937) మరియు పౌరాణిక సావిత్రి (1937) వంటి చిత్రాలలో కలస. నటించిన జంట. అంజాన్ (1941) వారు కలిసి తెరపై వచ్చిన చివరి చిత్రం. ఆమె నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మక మైనవి. అనేక మహిళా కేంద్రీకృత చిత్రాలను చేశారు. బాంబే టాకీస్ ద్వారా అచూన్ కన్యలో నటించగా, ఈ చిత్రం బ్రాహ్మణ అబ్బాయి మరియు అంటరాని అమ్మాయి ప్రేమ కథ ఆధారంగా మరియు సమాజంలోని కుల వ్యవస్థను ధైర్యంగా సవాలు చేసింది. సమాజ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా అచూత్ కన్య (1936) లో, తల్లి కాలేని గృహిణిగా నిర్మల (1939) లో, అనాథగా దుర్గ (1939), తిరగ బడిన మహిళగా సావిత్రి (1937) లో విధివంచితు రాలైన బ్రాహ్మణ యువతిగా జీవన్ ప్రభాత్ (1937) లో ఆమె నటన అనితర సాధ్యమైనది.

1940 మే 19లో హిమాంశు రాయ్ హఠాన్మరణం పొందడంతో బాంబే టాకీస్ నిర్వహణ బాధ్యత ఆమె చేతిలో పడింది. తర్వాత తీసిన బసంత్, కిస్మత్, అంజానా మొద లైన చిత్రాలు ఆర్థికంగా లాభాలు తెచ్చి పెట్టాయి.

తర్వాత బాంబే టాకీస్ స్టుడియోను దర్శించడానికి వచ్చిన సుప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు స్వెతస్లోవ్ రోరిక్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి 1945లో వివాహానికి దారి తీసింది. తర్వాత ఆమె సినీరంగానికి దూరమయ్యారు.

భారతీయ సినిమాకు పితామహు డుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 1969 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయగా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నెలకొల్పిన తొలిసారి 1969లో చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దేవికా రాణి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మొదటి గ్రహీతగా నిలిచారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. ఆమె సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభు త్వం 1958లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. చివరి రోజుల్లో బెంగుళూరులో గడుపు తూ 1994 మార్చి 9 తేదీన 85 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments