నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యుడు దయానంద.
స్వరాజ్ నినాదాన్ని తొలిసారి
నినదించి భారతీయుల మనసులలో చొప్పించిన దేశభక్తులు దయానంద సరస్వతి జయంతి.
స్వామి దయానంద సరస్వతి (ఫిబ్రవరి 12, 1824 – అక్టోబర్ 30, 1883) ఆర్య సమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన దేశ భక్తులు. భారతదేశం భారతీయులకే అనే “స్వరాజ్” నినాదాన్ని మొదటి సారిగా ప్రవచించినది ఆయనే. వేదాలను అంత చక్కగా అధ్యయనం చేసిన వారు భారత దేశంలో మరొకరు లేరు అని ఈయన గురించి స్వయంగా అరవిందుల వారే అన్నారు.
దయానంద సరస్వతి ఫిబ్రవరి 12, 1824లో గుజరాత్ లోని ఠంకార అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు మూలశంకర్.
ఆయన తండ్రి ఒక మహా శివ భక్తుడు, పద్నాలుగేళ్ల ప్రాయంలో ఒక శివరాత్రి నాడు శివలింగంపై విసర్జిస్తున్న మూషికాలను చూసి,
ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి 1846లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లారు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందారు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథురలోని స్వామి విరజానంద సరస్వతి వద్దకు చేరుకున్నారు. అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలు దేరారు. ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నారు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది. ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన భారతదేశం ఆ సమయం లో అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులి డుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగు చున్నది. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛ నీయమైన ఆచారాలు చూసి చలించి పోయారు. భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించారు. స్త్రీ విద్య పరిచయం చేసారు.
ఆ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందారు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నారు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలు దేరారు.
ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నారు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వ మానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులి డుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి ‘పాఖండ ఖండిని ‘ అన్న పతాకాన్ని ఆవిష్కరించారు.
ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించారు.
మేడంకామా, గురుదత్ విద్యార్థి, వినాయక్ దామోదర్ సావర్కార్, లాలా హర్దయాళ్, మదన్‌లాల్ ధింగ్రా, రాంప్రసాద్ బిస్మల్, మాహాదేవ గోవిందరనడే, స్వామి శ్రద్ధానంద, మహాత్మా హంసరాజ్, లాలా లజపతిరాయ్ తదితరులు ఆయనచే ప్రభావితు లైనారు. ఈయన రచించిన సత్యార్థ ప్రకాష్ గ్రంథం సుప్రసిద్ధమైనది. మత మార్పిడిలు చేసిన వారిని తిరిగి హిందూ మతంలోకి రప్పించడానికి శుద్ధిఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినారు. ఏడు సార్లు విష ప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా అక్టోబర్ 30, 1883 దీపావళి సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకార నాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందారు. ఆయన తన వాదనలను, ఉద్యమాన్ని సమర్థిస్తూ అథర్వణ, యజుర్వేదం వంటివి భాష్యం చేసిన వేద భాష్యకారుడు. 30 అక్టోబరు, 1883న దయానంద సరస్వతి మరణించారు.