HomeLifestyleLife styleఅజరామరాలు...సుబ్రహ్మణ్యం చందమామ ధారావాహికలు

అజరామరాలు…సుబ్రహ్మణ్యం చందమామ ధారావాహికలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

తెలుగు సంస్కృతికి ప్రతీక, భారతీయ సనాతన సంప్రదా యానికి పతాక, చక్రపాణి మానస పుత్రిక బి.నాగిరెడ్డి పిల్లల పత్రిక…చందమామ. దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితం, 1947 జూలై నెలలో తొలి సారిగా ‘చంద మామ’ ఆవిష్కృతం అయింది. సరళమైన భాష, చక్కటి శైలి, చిన్న చిన్న పదాలు అర్ధవంతమైన భాష, ఆకర్షణీయ మైన బొమ్మలు. చందమామ అనిర్వచనీయ కథలన్నీ ఆ బాల గోపాలాన్నీ మరో ప్రపంచానికి తీసుకెళ్ళే వశీకరణ రూపాలే. చందమామ గురించి కవి సమ్రాట్, ‘చందమామ నా చేత కూడా చదివిస్తున్నారు. పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా’ అని ఒక సందర్భంలో అన్నారంటే చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల పెద్దల మనసులో ఎంత స్థానం సంపాదిం చుకుందో అర్థం చేసుకోవచ్చు. చందమామ గురించి తెలియని తెలుగు వారు లేరనే చెప్పాలి. ఒకనాడు చిన్నారుల నుండి పెద్దల వరకు చందమామ కథలు చదువని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. చందమామ సంపాదక బృందంలో మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం, రంగారావు, బైరాగి ఉండే వారు. అనంతరం దాసరి సుబ్రహ్మణ్యిం, కొడవటిగంటి కుటుంబరావు చేరారు. కృష్ణశాస్త్రి, చలం, చింతా దీక్షితులు, శ్రీశ్రీ, ఏటుకూరి వెంకట నర్సయ్య, విద్వాన్ విశ్వం, ఆలూరి బైరాగి, డా. అవసరాల రామకృష్ణారావు, పాలంకి రమచంద్రమూర్తి వంటి వాళ్ల రచనలు కూడా తొలి నాళ్లలో చందమామలో చోటు చేసు కున్నాయి.

చందమామ అంటేనే జానపదాలకు ప్రసిద్ధి. ఈ జాన పదాల సృష్టికర్త దాసరి సుబ్రహ్మణం కావడం విశేషం. చందమామతో దాసరి సుబ్రహ్మణ్యంకు గల బంధం, అనుబంధం విడదీయ జాలనివి. తెలుగులో బాలల పత్రికల ద్వారా జానపద కథా సాహిత్య సృష్టికర్త ఆయన.

దాసరి సుబ్రహ్మణ్యం చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో చందమామలో చేరి, 2006 దాకా అంటే 55 సంవత్స రాల కాలం అందులోనే కొన సాగాడు. తెనాలి ప్రాంతంలో జన్మించిన సుబ్రహ్మణ్యం పెద్దగా చదువుకోక పోయినా నిరంతర అధ్యయనంతో, బాల్యంలోనే తెలుగు ప్రబంధ కావ్యాలు, పంచ తంత్ర కథలు, కథా సరిత్సాగరం లాంటి పుస్తకాలను బాగా చదివాడు.
దాసరి బొమ్మరిల్లు, ప్రమోద, జాబిల్లి, స్నేహబాల, మిలియన్ జోక్స్… ఈ పత్రికల్లో వెలువడిన జానపద ధారావాహికల స్రష్ట. తోకచుక్క’ నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ పన్నెండు సీరియల్స్ 12 ధారా వాహికలను రాసిన ప్రతిభాశాలి. ఆయన సృష్టించిన ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు, శిఖిముఖి, విక్రమ కేసరి, మౌగ్లీ, కాలశంబరుడు మొదలైన పాత్రలు తెలుగు వారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందాయి.

ముందుగా ఆయన కమ్యూ నిజాన్నీ, హేతువాదాన్ని అధ్య యనం చేశాడు. పదహారేళ్ళకే కమ్యూనిస్టు ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. జైలుకు వెళ్ళాడు. బోధన్ చక్కెర కర్మాగారంలో, మహారాష్ట్రలోని ఆంగ్లేయుల సైనిక శిక్షణా శిబిరంలో కూడా కొద్ది రోజుల పాటు పనిచేశాడు. తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి పాండిచ్చేరి చేరుకున్నాడు. అక్కడ అరవిందా శ్రమం ప్రెస్ లో తెలుగు కంపోజర్ గా, ప్రూఫ్ రీడర్ గా పనిచేశాడు. మెల్ల మెల్లగా పత్రికా సంపాద కులతో పరిచయాలు పెంచు కున్నాడు. అలా చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, అభిసారిక వంటి పత్రికల్లో సాంఘిక కథలు రాయటం ప్రారంభించాడు. అప్పుడే చక్రపాణి నుంచి పిలుపు రావడంతో చందమామలో చేరాడు. అక్కడ చేరిన మొదట్లో సాదా కథలతో సరిపెట్టుకున్న ఆయన రాజారావు ఆకస్మిక మరణంతో ఆయన రాస్తూ వచ్చిన సీరియల్ విభాగంలో దాసరికి అవకాశం వచ్చింది. ఆయన రాసిన మొట్ట మొదటి సీరియల్. బాల సాహిత్య చరిత్రలో సంచలనం సృష్టించిన తోకచుక్క. చందమామ ఆఫీసు ప్రాంతంలోనే గది తీసుకుని ఒంటరిగా ఉండే వాడు. పాతికేళ్ళ పాటు ఆయన ధారావాహికలు చందమామలో నిరాటంకంగా ప్రచురిత మయ్యాయి. వ్యక్తిగత కారణాలతో 1978 తర్వాత ఆయన సీరియల్స్ రాయడం మానుకున్నాడు.

చందమామలో…తోకచుక్క (1954 – 55), మకర దేవత (1955 – 56), ముగ్గురు మాత్రికులు (1957 – 58),
కంచుకోట (1958 – 59), జ్వాలా ద్వీపం (1960 – 61), రాకాసి లోయ (1961 – 64), పాతాళ దుర్గం (1966 – 67), శిథిలాలయం (1968 – 70), రాతిరథం (1970 – 72), యక్ష పర్వతం (1972 – 74),
విచిత్ర కవలలు (1974 – 76),
మాయా సరోవరం (1976 – 78),
భల్లూక మాత్రికుడు (1978 – 80); అలాగే బొమ్మరిల్లులో … మృత్యు లోయ (1971 – 74), శిథిల నగరం (1974 – 75), మంత్రాల దీవి (1976 – 80), గంధర్వ నగరం (1980-82), సర్ప కన్య (1982-85), తో పాటు పలు పత్రికలలో పిల్లల కథలు పుష్క లంగా రాసి, చందమామ సుబ్రహ్మణ్యంగా తెలుగు పాఠక లోకంలో చిరస్థాయిగా నిలిచి పోయాడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments