Wednesday, November 30, 2022
HomeLifestyleDevotionaldaily horoscope in telugu, Horoscope Today Nov 15th ఈరోజు తులా రాశి వారికి...

daily horoscope in telugu, Horoscope Today Nov 15th ఈరోజు తులా రాశి వారికి అద్భుత ఫలితాలు… మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే…! – horoscope today 15 november 2022 daily astrology of zodiac signs in telugu

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

horoscope today 15 November 2022 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి కర్కాటక రాశిలోనే సంచారం చేయనున్నాడు. ఈరోజు పుష్య నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది. శుక్రుడు, అంగారకుడు కలిసి కొన్ని శుభ యోగాలను ఏర్పరచనున్నారు. ఈ సమయంలో తుల రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజున ఏ రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

​మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

-aries-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు మంచి వ్యక్తులతో గడపడం వల్ల మానసికంగా మరింత మెరుగవుతారు. ఈరోజు మీరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేయొచ్చు. ఒంటరి వ్యక్తులు ఈరోజు ప్రత్యేకంగా ఎవరినైనా కలుసుకోవచ్చు. ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ కారణంగా మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ భార్యభర్తల మధ్య అనుబంధంలో మాధుర్యం ఉంటుంది. ఈరోజు కొన్ని సందర్భాల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవచ్చు.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

Retro Mars Transit in Taurus వృషభంలో కుజుడి తిరోగమనం.. ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త…!

​వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

-taurus-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో చాలా బిజీగా పాల్గొంటారు. మీ భవిష్యత్తు ప్రణాళికలను నిజం చేసుకోవడానికి ఈరోజు సరైన సమయం. ముఖ్యంగా స్త్రీలు కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. మరోవైపు చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం వల్ల మీ ఇంటి వాతావరణం పాడవుతుంది. అందుకే ఈరోజు మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు పెరగడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరగొచ్చు. కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి. ఆరోగ్య పరమైన విషయాలపై ఈరోజు ఎక్కువ శ్రద్ధ వహించాలి.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు ఆంజనేయుడి ఆలయానికి వెళ్లి కొబ్బరికాయను దానం చేయాలి.

​మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

-gemini-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు బాగా ఆలోచించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యక్తులతో సంప్రదింపులు కూడా బాగా నేర్చుకునే మీ శక్తిని మేల్కొల్పుతాయి. మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఒక నిర్దిష్ట వ్యక్తి మీపై చేసే విమర్శ వల్ల నిరాశకు గురవుతారు. ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం వల్ల మీకు ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతుడిని పూజించాలి.

​కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

-cancer-horoscope-today

ఈ రాశి వారికి ఈరోజు పనుల విషయంలో కొంత హడావిడి ఉంటుంది. అయితే దీని వల్ల మీ అలసట తొలగిపోతుంది. మీ సామర్థ్యాన్ని నమ్మకండి. ప్రస్తుతానికి గ్రహాల స్థానం సానుకూలంగా ఉండటం వల్ల, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాహనం లేదా ఏదైనా మెకానికల్ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. అజాగ్రత్త వల్ల మీ విద్యా రంగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని కొత్త బాధ్యతలు రావొచ్చు. వాటిని మీరు సక్రమంగా నిర్వర్తించగలరు. ఈరోజు మీరు కొంత సమయం కుటుంబంతో గడపాలి.

ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు ఆంజనేయుడికి చోళాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

​సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

-leo-horoscope-today

ఈ రాశి వారికి ఈరోజు మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. మీ పెండింగ్ పనులను పూర్తి చేయొచ్చు. మీ ఇంటిని క్రమబద్ధంగా ఉంచేందుకు మీరు చేయగలిగే కొన్ని మార్పులపై కూడా చర్చించొచ్చు. అయితే ఈరోజు ఆర్థిక పరమైన విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయాలపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఇంట్లో ఏవైనా వివాదాలంటే సామరస్యంగా పని చేయాలి. మీ పనులు, ప్రణాళికల గురించి ఎవరితోనూ చర్చించొద్దు. వాతావరణంలో మార్పులు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతునికి తులసి మాల సమర్పించాలి.

​కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

-virgo-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు గతంలో చేసిన కొన్ని తప్పులను సరిదిద్దుకోవడం ఎలాగో తెలుసుకుంటారు. వర్తమానాన్ని మెరుగుపరచడం గురించి ఆలోచిస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల సంతోషం కలుగుతుంది. మీ స్నేహితులతో వివాదాలు ఏర్పడొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆన్‌లైన్ కార్యకలాపాలకు కొంత సమయం కేటాయించడం కూడా అవసరం. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శివలింగానికి నీటిని సమర్పించి, శివ చాలీసా పఠించాలి.

Gajkesari Yoga 2022 గజకేసరి యోగంతో ఈ 3 రాశులకు తిరుగే ఉండదు…! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి…

​తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

-libra-horoscope-today

ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రభావం కారణంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రణాళికలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇంటి పెద్దల నుండి సరైన మార్గదర్శకత్వం పొందొచ్చు. విజయం సాధించడం ద్వారా యువత కూడా ఉపశమనం పొందొచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించండి, తద్వారా మీరు అవకాశాన్ని మంచి అవకాశాల్ని పొందుతారు. ఆస్తి, వాహనానికి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది.

ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు ఆంజనేయుడి ఎదుట ఐదు మల్లెపువ్వుల దీపాలను వెలిగించాలి.

​వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

-scorpio-horoscope-today

ఈ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించడంలో మీ శక్తిని ఉపయోగించాలి. అప్పుడే మీరు మంచి విజయం సాధిస్తారు. ఈరోజు మీ బంధువుతో కూడా ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇరుగుపొరుగు వారితో వివాదాలు ఏర్పడొచ్చు. అదనపు పనుల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. రాజకీయ కార్యకలాపాల్లో చెడు కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు ఏవైనా ఇబ్బందులు రావొచ్చు.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతుడికి బూందీ సమర్పించాలి.

​ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

-sagittarius-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు ఆస్తికి సంబంధించిన వివాదాలను ఇతరుల జోక్యంతో శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. మరోవైపు దగ్గరి బంధువును కలవడం ద్వారా రోజువారీ సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు. సోమరితనం, కోపం మీ జీవితంలోని విషయాలను పాడు చేయగలవు. ఇది ఎనర్జిటిక్‌గా ఉండాల్సిన సమయం. ఖర్చుల విషయంలో చాలా తెలివిగా ఉండాలి. వ్యాపారులు, ఉద్యోగులు తమ పనులు చేసే సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు పొట్టకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.

​మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

-capricorn-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు పెండింగులో ఉన్న పనులను శ్రమతో పూర్తి చేస్తారు. రాజకీయ, సామాజిక కార్యకలాపాలపై కూడా మీరు ఆధిపత్యం చెలాయించొచ్చు. మీ పిల్లల సమస్యలను విని, వాటికి పరిష్కారాలను కనుగొనేందుకు సమయం వెచ్చించాలి. సామాజిక కార్యకలాపాలతో పాటు, మీ కుటుంబ కార్యకలాపాలపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కోర్టు కేసులేమైనా పెండింగులో ఉంటే అనుభవం ఉన్న వారి సలహా మాత్రమే తీసుకోవాలి. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు ఉపవాసం ఉండి సుందరకాండ పఠించాలి.

​కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

-aquarius-horoscope-today

ఈ రాశి వారిలో విద్యార్థులు విద్యపై పూర్తిగా దృష్టి సారిస్తారు. మీ ఇంటి పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. మీరు వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు బయటి వ్యక్తితో తగాదా లేదా వివాదాల పరిస్థితి తలెత్తొచ్చు. భావోద్వేగాల బలహీనత వల్ల మీరు ఎక్కువగా బాధపడొచ్చు. మీరు పని చేసే రంగంలో పోటీదారులు చురుగ్గా ఉండొచ్చు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు మీరు హనుమంతుడిని పూజించాలి.

​మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

-pisces-horoscope-today

ఈ రాశి వారు ఈరోజు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ కుటుంబ సంబంధిత పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉండొచ్చు. ఈరోజు మీరు సానుకూల ఆలోచనలతో ఉండటం వల్ల మార్పు వస్తుంది. ఏ సమస్యలెదురైనా కుటుంబం సభ్యుల నుంచి సరైన మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో తోబుట్టువులకు మీ సహాయం అవసరమవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠించాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments