5.1 C
New York
Sunday, April 2, 2023
HomeEntertainmentMovie Updatesస‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ ‘శాకుంత‌లం’... ఫ‌స్ట్...

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ ‘శాకుంత‌లం’… ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌.. పాన్ ఇండియా మూవీగా విడుదలకు సన్నద్ధమవుతోన్న అందమైన దృశ్య కావ్యం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

యూ ట‌ర్న్‌, ఓ బేబి వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందిస్తోన్న విజువ‌ల్ వండర్ ‘శాకుంత‌లం’. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. సోమ‌వారం ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
టాలీవుడ్‌లో ఇప్పటి వరకు రానటువంటి అందమైన, అద్భుతమైన, చూడచక్కటి దృశ్య కావ్యంగా ‘శాకుంతలం’ సినిమాను డైరెక్టర్ గుణ శేఖర్ ఆవిష్కరిస్తున్నారు. ఓ డైరెక్టర్‌గా, మేకర్‌గా తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కించిన వారిలో గుణ శేఖర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించడం ఆయన అలవాటు. ఆయన సినిమాలను, వాటిని ఆయన తెరకెక్కించిన విధానం చూస్తే ఆ విషయమ మనకు అవగతం అవుతుంది. ‘శాకుంతలం’ చిత్రాన్ని కూడా ఇది వరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త ప్రేమ కావ్యంగా ఆయన మలుస్తున్నారు. అందుకు తార్కాణమే ఇప్పుడు మనం చూస్తున్న ‘శాకుంతలం’  ఫస్ట్ లుక్. 
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించే చిత్రాల్లో పెద్ద అడవి. పచ్చటి పరిసరాలు.. అందులో జంతువులను చూసి మన పిల్లలు అబ్బుపడుతుంటారు. అలాంటి అబ్బురపడే సన్నివేశాలను శాకుంతలంలో వీక్షించవచ్చు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. ముని క‌న్య పాత్ర‌లో ఆశ్ర‌మంలో కూర్చుని ఉన్న స‌మంత‌, ఆమె నెమ‌ళ్లు, జింక‌లు, హంస‌లు ఇత‌ర వన్య ప్రాణులు నిలుచుని ఉన్నాయి. ఆమె దేని కోస‌మే ఎదురు చూస్తోంది. ఫ‌స్ట్ లుక్ చాలా కూల్‌గా అనిపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ చాలా పొయెటిక్‌గా మనసుకు హత్తుకునేలా ఉంది. మేకింగ్‌లో అన్ కాంప్రమైజ్డ్‌గా సినిమాను రూపొందించే గుణ టీమ్ వర్క్స్ రుద్రమదేవి వంటి హిస్టారికల్ వండర్ తర్వాత.. దాన్ని మించేలా మరో అద్భుతాన్ని, పెద్ద కాన్వాస్‌ గీసిన అందమైన పెయింటింగ్‌ను చూస్తే మనసుకు ఎంత సంతోషం కలుగుతుందో అలాంటి భావాన్ని మన మనసులకు కలిగించేలా ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా రూపొందిస్తోంది గుణ టీమ్ వర్క్స్. 
హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి – గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ‘శాకుంతలం’ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని అప్ డేట్స్‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు. 
నటీనటులు:
సమంత
సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ :  దిల్ రాజుబ్యాన‌ర్స్ :  డిఆర్‌పి – గుణ టీమ్ వ‌ర్క్స్‌ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  గుణ శేఖ‌ర్‌నిర్మాత :  నీలిమా గుణ‌సంగీతం : మ‌ణిశ‌ర్మ‌సినిమాటోగ్ర‌ఫీ :  శేఖ‌ర్ వి.జోసెఫ్‌మాట‌లు :  సాయి మాధ‌వ్ బుర్రాఎడిటింగ్ :  ప్ర‌వీణ్ పూడిప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌:  అశోక్‌కాస్ట్యూమ్స్  డిజైనింగ్ :  నీతా లుల్లాపి.ఆర్.ఓ :  వంశీ కాకా

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments