ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద రీతిలో భారత్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ చేయిస్తుంది. ఇది చూసి తట్టుకోలేని కొంతమంది ప్రబుద్ధులు భారత్ వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.దీనితో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవాలంటేనే భయపడుతున్నారు.ఈ భయాన్ని దూరం చేయడానికే ప్రస్తుతం ప్రభుత్వం అవగాహన కలిగించే కార్యక్రమాలను మొదలుపెట్టింది.ఇది అంతగా పని చేస్తున్నట్లు అనిపించట్లేదు.
దీనితో మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న జవహర్ సింగ్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అదేంటంటే తాజాగా జవహర్ సింగ్ యముడి వేషంలో వ్యాక్సిన్ సెంటర్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నాడు.కరోనా మహమ్మారిని జయించలంటే వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇలాంటి వినూత్న ప్రయోగాన్ని చేశాను అని అన్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం జవహర్ సింగ్ చేసిన వినూత్న ప్రయోగం తెగ వైరల్ అవుతుంది.దీనిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.