దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది.దీన్ని కంట్రోల్ చేయడం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.ఇలాంటి సందర్భంలో కరోనా కొరలలో చాలామంది ప్రముఖులు చిక్కుకుంటున్నారు.తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
మైల్డ్ సింప్టంస్ ఉండడంతో అల్లు అర్జున్ తాజాగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు.దీంట్లో కరోనా పాజిటివ్ అని రావడంతో బన్నీ ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారని సమాచారం.