రాష్ట్రంలో సమగ్ర , సమతుల్య అభివృద్ధి –

Date:


– అభరు త్రిపాఠి స్మారకోపన్యాసంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించింది. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశాం’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో శుక్రవారం అభరు త్రిపాఠి స్మారక ఉపన్యాసంలో భాగంగా ‘కొత్త రాష్ట్రం-సవాళ్లు’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు.
హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. దశాబ్దాల పోరాటం తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉన్నాయని, ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయని అన్నారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, శాంతిభద్రతలు ఎలాంటి విఘాతం కలగలేదన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్‌ ప్రతి ఇంటికి తాగునీరు అందించారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ పథకం అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయని, కరెంట్‌ ఎక్కువ అవసరం పడుతుందనీ, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తు న్నామని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్పారు. దాంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
మిషన్‌ భగీరథ లాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొడుతున్నాయని పేర్కొన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చామని, అయితే నిటి ఆయోగ్‌ చెప్పినా మోడీ సర్కార్‌ తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదన్నారు. కేంద్రానికి రాష్ట్రం రూపాయి ఇస్తే, రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...