అహనా పెళ్ళంటా, పూలరంగడు చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. పలువురు దర్శక నిర్మాతలు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇటీవల వీరభద్రమ్ చౌదరి హీరో శ్రీకాంత్ తో చేసిన రియల్ ఎస్టేట్ యాడ్ బాగా పాపులర్ అయ్యింది.
త్వరలో వీరభద్రమ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో ఉన్న ఈ చిత్రంలో ఒక యంగ్ హీరో నటించబోతున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన సమయంలో ఈ సినిమాను అధికారికంగా చిత్ర నిర్మాత ప్రకటించనున్నారు.
తన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు మరో మంచి కథ కథనాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని, నా పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు వీరభద్రమ్.
అలరించే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా: దర్శకుడు వీరభద్రమ్
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES