సినీ ఇండస్ట్రీకి చెందిన నటినటులు పెళ్లి, విడాకుల వ్యవహారంలో బాగా వైరల్ అవుతుంటారు.ఇట్టే ఆకర్షణకు లోనై ప్రేమించుకొని.
కుదిరితే వివాహం చేసుకుంటారు.కానీ చిన్న చిన్న మనస్పర్ధలకే ఇట్టే విడిపోతారు.
ఇవన్నీ వాళ్ళకు మామూలే.నిజానికి వారికి ఇవి కూరలో కరివేపాకు లాగా అనిపిస్తూ ఉంటాయి.
కానీ జనాలు మాత్రం వారి విడాకులను జీర్ణించుకోలేకపోతారు.ఇప్పటికే సమంత, నాగ చైతన్య( Samantha, Naga Chaitanya ) విడిపోగా రీసెంట్ గా మెగా డాటర్స్ శ్రీజ, నిహారిక కూడా విడాకులు తీసుకోవటంతో వీరి అభిమానులు తట్టుకోలేకపోయారు.
కానీ వారు మాత్రం సంతోషంగా ఉంటారు.వాళ్ళు కాకుంటే మరొకరు అన్నట్టుగా ఉంటారు.
ఒంటరి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా మరో హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు కలర్స్ స్వాతి( Colors Swati ) .మాటీవీలో ప్రసారమైన బుల్లితెర షో కలర్స్ ద్వారా పాపులర్ అయింది.2005లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన డేంజర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత వరుస అవకాశాలతో అష్ట చమ్మ, గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమాల వల్ల ప్రసిద్ధి చెంది మంచి గుర్తింపు పొందింది.
తర్వాత మలయాళ, తమిళ ( Malayalam, Tamil )సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో పాపులర్ నటిగా ఎదిగింది.స్వాతి సినిమా కెరీర్లో బిజీగా రాణిస్తూ.2018లో వికాస్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.వివాహం తర్వాత కాస్త సినిమాలకు దూరమైంది.
అందుకు కారణం కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయని త్వరలో విడిపోతారని అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి.

కానీ అవన్నీ ఫేక్ వార్తలు అని అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది.ఆ సమయంలో మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రి ఇచ్చి వరుస సినిమాలు చేసింది.ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న కూడా అభిమానిని మాత్రం ఈమెపై ఎప్పుడూ అభిమానం చూపిస్తూనే ఉంటారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తను తన భర్తతో విడాకులు తీసుకుటుందని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.కారణం ఏంటంటే తను తన సోషల్ మీడియా ఖాతాలో తన భర్త ఫోటోలను, పెళ్లికి సంబంధించిన ఫోటో లను డిలీట్ చేసినట్లు తెలుస్తుంది.
గతంలో సమంత, నిహారిక, శ్రీజ ఇలా విడాకులు తీసుకున్న మరికొంతమంది జంటలు విడిపోక ముందు ఇన్ స్టా లో తమ భర్త ల ఫోటోలు డిలీట్ చేసి విడాకులు తీసుకుంటున్నామని అందరికీ హింట్ ఇచ్చారు.అయితే స్వాతి ఇదే పని చేయటంతో అందరూ అనుమానం పడుతున్నారు.
మరి దీని గురించి స్వాతి ఏమని స్పందిస్తుందో తెలియదు కానీ జనాలు మాత్రం ఇది నిజమే అని అనుకుంటున్నారు.ఇక ఈ విషయం ఇప్పుడు వైరల్ అవ్వటంతో తన అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.
ఈ వార్తలలో ఎంత నిజం ఉందో స్వాతి స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
