విశేష ఫల దాయిని చుక్కల అమావాస్య

Date:

ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని నమ్మకం. హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే, కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. ఇక ఆషాఢ మాసంలో చేసే జప తపాలకు, దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృ కర్మలు నిర్వహించినా, వారి పేరున దాన ధర్మాలు చేసినా పెద్దల ఆత్మ శాంతిస్తుందని విశ్వాసం. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ, మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి, ఆమెను కొలుచు కుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.

ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు… కొత్త కోడళ్లు, వివాహితులు కూడా ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారు. ఇందుకోసం గౌరీపూజని చేసి, సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు నిర్ణీత చుక్కలు పెట్టి వాటి మీద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లి మరునాడు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట.

అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. లక్ష్మిప్రదమైన శ్రావణమాస ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య కనుక ఈ రోజు అధికసంఖ్యలో దీపాలను పెట్టి లక్ష్మీదేవిని పూజించడం మంగళ ప్రదమని ధర్మశాస్త్ర వచనం. ఇలా దీప ప్రజ్జ్వలనము చేయడం వలన పితృదేవతలు సంతోషించి వారి ఆశీస్సులు మనకు అందిస్తారని విశ్వాసం. ఆషాడ అమావాస్యను మహారాష్ట్రలో ‘గటారి అమావాస్య’ అని కూడా అంటారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి భారతదేశ ఉత్తర పరిస్థితులలో హరియాలీ అమావాస్య ఆనందం చాలా గొప్పది. ఇది వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది, ఆషాఢ అమావాస్యను కర్ణాటకలో ‘భీమన అమావాస్య’, ఆంధ్ర ప్రదేశ్‌లో ‘చుక్కల అమావాస్య’, ఒరిస్సాలో ‘చిటలగి అమావాస్య’, గుజరాత్ రాష్ట్రంలో ‘హరియాలి అమావాస్య’గా కూడా జరుపుకుంటారు. వివాహిత మహిళలు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మంచి జీవిత భాగస్వాముల కోసం కొన్ని చోట్ల అవివాహిత మహిళల వ్రతాచరణ ఉంది.
దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి, ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చని భావిస్తారు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...