Chiranjeevi: మంచి పాటను ఖూనీ చేసిన చిరంజీవి.. సోహైల్‌ని చూసి నేర్చుకో బాసూ..

Date:


తెలంగాణ జానపద పాట “నర్సపల్లే.” అద్భుతంగా పాడి సూపర్ పాపులర్ అయింది కనకవ్వ( kanakavva ).ఒక్క యూట్యూబ్‌లోనే కాకుండా ఆమె పలు టీవీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొని తన గాత్రంతో ఉర్రూతలూగించింది.మంగ్లీతో కలిసి అద్భుతమైన పర్ఫామెన్స్‌లు ఇచ్చింది.

 Telangana Song Murder By Chiranjeevi-TeluguStop.com

అయితే ఈ నర్సపల్లే పాటను చిరంజీవి తన భోళాశంకర్( Bholashankar ) సినిమాలో వాడేసాడు.కాకపోతే ఆ సాంగ్ ట్యూన్, సింగర్‌ను మార్చేశాడు.

లిరిక్స్ కూడా తన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా చేంజ్ చేశాడు.అది చాలదన్నట్టు దాన్ని మరో పాట మధ్యలో ఇరికించాడు.

Telugu Bholashankar, Chiranjeevi, Kanakavva, Pregnant, Narsapalle, Sohel, Telang

తెలంగాణ జానపద వాసన లేకుండా నర్సపల్లే పాటను ఖూనీ చేసి జనాల మీదకి వదిలాడు.ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు ఇదే విషయంపై ఒక చర్చ కూడా మొదలుపెట్టారు.మహతి స్వర సాగర్( Mahati Swara Sagar ) కంపోజ్ చేసిన ఈ పాట మొదట “జామ్ జామ్ జజ్జనక” అంటూ స్టార్ట్ అవుతుంది.కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట లిరిక్స్‌ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు.

మొదట ఒక పాట, తర్వాత నర్సపల్లే పాట ఈ రెండూ క్లబ్ చేసి వదిలిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో కోటికి పైగా వ్యూస్ తో బాగానే వైరల్ అయింది.కాకపోతే ఈ పాటపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణ వాసులు.నర్సపల్లే పాటను అదే ట్యూన్ లో కనకవ్వతోనే పాడిస్తే బాగుండేదని చాలామంది అంటున్న మాట.డప్పేస్కో… దరువేస్కో.లంటూ పదాలతో ఈ సాంగ్ ప్రారంభమవుతుంది.

ఇక్కడ దరువు తెలంగాణ పదమే కాకపోవడం గమనార్హం.ఈలేస్కో, ఇరగేస్కో, చిందేస్కో వంటి నాన్‌-తెలంగాణ వర్డ్స్ ఇందులో చాలానే ఉన్నాయి.

Telugu Bholashankar, Chiranjeevi, Kanakavva, Pregnant, Narsapalle, Sohel, Telang

ఇలాంటి అన్ని పదాలు వాడేసిన తర్వాత చిరంజీవి పాట మధ్యలో ట్విస్ట్ ఇచ్చి… ‘తమ్ముళ్లూ, మనకు కాస్త చేంజ్ కావాలమ్మా… దరువు మార్చి కొత్త సౌండేస్కోండి’ అని ఓ మాస్ డైలాగు వదులుతాడు.దాంతో వెంటనే సాంగ్ మారిపోయి ‘నర్సపల్లే గండిలోన గంగధారి.నాటుపిల్ల మాటలకు పోటుగాడు రెచ్చిపోయే గంగధారి’ అంటూ పాట మొదలవుతుంది.మొత్తం మీద ఈ పాట తెలంగాణ స్వచ్ఛమైన ఫీల్ కోల్పోయింది.ట్యూన్ మార్చేసి, వేరే వాళ్ళతో పాడించేసి, తన స్టెప్పులకు తగినట్లుగా లిరిక్స్ ఖూనీ చేసేసి ఈ పాటను ఆగమాగం చేసేసారని చాలామంది విమర్శలు చేస్తున్నారు.మరోవైపు బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్( Sohel ) తన నెక్స్ట్ మూవీ “మిస్టర్ ప్రెగ్నెంట్”( Mr.Pregnant )లో కూడా నర్సపల్లే పాట వాడుకున్నాడు.దీనిని కనకవ్వే పాడింది.

ట్యూన్ కూడా దాదాపు అలానే ఉంది.ఈ పాట వినడానికి చాలా బాగుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు చిరంజీవి పై విమర్శలు చేస్తున్నారు.సాంగ్ ని మార్చేసి, ఖూనీ చేసే బదులు పుష్ప సినిమాలో లాగా సొంత సాంగ్స్ రాయించుకోవచ్చు కదా అని చివాట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

బన్నీ కన్నా ముందు త్రివిక్రమ్ మరో సినిమా?

డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి...

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...