టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న’ చావు కబురు చల్లగా ‘ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ చిత్రాన్ని జి.ఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా, కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్‌బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ డ్రైవర్ గా,లావణ్య త్రిపాఠి నర్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని కీలక పాత్ర పోషిస్తున్నారు.మార్చ్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ బర్ద్వాజ్ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారని ఓ రూమర్ చక్కెర్లు కొడుతుంది.మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సివుంది.
డిఫరెంట్ టైటిల్,డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కలిగిన ఉన్న ఈ చిత్రం ఫుల్ ఆక్యుపెన్సీ కు అనుమతులు లభించిన థియేటర్స్ లో ఏ రేంజిలో బిజినెస్ చేయనున్నది వేచి చూడాలి.