5.1 C
New York
Saturday, June 3, 2023
HomeEntertainmentMovie Updatesఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ 'రాబర్ట్‌' ప్రీ రిలీజ్‌ వేడుక

ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ ‘రాబర్ట్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాబ‌ర్ట్‌’. మార్చి 11న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో …
ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్ మాట్లాడుతూ – “తెలుగు ప్రేక్షకులు మాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. అందరి సహాయ సహకారాలతోనే ఈ స్థాయికి చేరుకున్నాం. చదలవాడ శ్రీనివాస్‌గారికి, ప్రసాద్‌గారికి, దేవరాజ్‌గారికి థాంక్స్‌. జగపతిబాబుగారు అందించిన సపోర్ట్‌తోనే నానా క్యారెక్టర్‌ అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్‌ తరుణ్‌ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. రాబర్ట్‌ మా డ్రీమ్‌. నిర్మాత ఉమాపతిగారే ఈ సినిమాకు అసలు సిసలైన హీరో. చాలా ప్యాషన్‌తో సినిమాను నిర్మించాడు. మార్చి 11న సినిమా విడుదలవుతుంది. మీరు మాకు సపోర్ట్‌ చేస్తారని భావిస్తున్నాను” అన్నారు. 
వెర్సటైల్‌ యాక్టర్‌ జగపతిబాబు మాట్లాడుతూ – “దర్శన్‌ వంటి హీరో, తరుణ్‌ కిషోర్‌ వంటి డైరెక్టర్‌, ఉమాపతి శ్రీనివాస్‌ గౌడ వంటి నిర్మాత ఉన్నప్పుడు సినిమా కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంతో సినిమాలో నటించడానికి ఓకే అన్నాను. దర్శకుడు తరుణ్‌ కథను నెరేట్‌ చేసిన విధానం అంత బాగా నచ్చింది. దర్శన రియల్‌ స్టార్. యాక్టర్స్‌ అవడం గొప్పకాదు. రియల్‌ లైఫ్‌లోనూ తను హీరోనే. ఎవరైనా హెల్ప్‌ కావాలంటే ఆలోచించకుండా చేసే వ్యక్తి. ఆయన హీరోగా చేసిన రాబర్ట్‌ సినిమా మార్చి 11న విడుదలవుతుంది. సినిమాను చాలా పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌ తరుణ్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. వర్క్‌ను చక్కగా చేయించుకుంటాడు. నిర్మాత ఉమాపతిగారి విజన్‌  చాలా గొప్పది. పాన్‌ ఇండియానే కాదు, పాన్ వరల్డ్‌ మూవీ చేసేంత విజన్‌ ఉన్న నిర్మాత. మంచి మనసున్న నిర్మాత.  సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు. 
చిత్ర దర్శకుడు  త‌రుణ్ కిషోర్ సుధీర్‌ మాట్లాడుతూ – “మా సినిమా ట్రైలర్‌, పాటలకు తెలుగు ప్రేక్షకులు అద్భుతమైన స్పందన ఇచ్చారు. చదలవాడ శ్రీనివాస్‌గారికి థాంక్స్‌. ఆయనే మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏ భాష అయినా ప్రేక్షకుడు కనెక్ట్‌ అయ్యేది ఎమోషన్‌కే. దాని ఆధారంగానే రాబర్ట్‌ సినిమాను తెరకెక్కించాం. దర్శన్‌సార్‌ను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకున్నారో.. అలాగే ఈ సినిమాలో చూపిస్తున్నాం. నేను ఈ సినిమాను ఇక్కడ వరకు తీసుకు రావడానికి ముఖ్య కారణం ఇద్దరు వ్యక్తులు. వారెవరో కాదు హీరో దర్శన్‌గారు.. నిర్మాత ఉమాపతిగారు. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. తెలుగులో హనుమాన్‌ చౌదరిగారు మంచి డైలాగ్స్‌ రాశారు. హీరోయిన్‌ ఆశాభట్‌ ప్రతి సీన్‌ కోసం కష్టపడి చేశారు. జగపతిబాబుగారు కథ వినగానే పాత్ర నచ్చి సినిమా చేస్తానని అన్నారు. రాబర్ట్‌ పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో.. అంతే గొప్పగా జగపతిబాబుగారి పాత్ర ఉంటుంది. కన్నడలో కూడా ఆయన డబ్బింగ్‌ చెప్పారు. ఇక నేను ఈ స్థాయిలో నిలబడి ఉండటానికి కారణమైన దర్శన్‌గారికి స్పెషల్ థాంక్స్‌. ఆయన కారణంగా దర్శకుడిగా నాకు తొలి గుర్తింపు వచ్చింది. నా తొలి సినిమాలోనే మంచి స్క్రిప్ట్‌ ఉంటే చెప్పు అన్నారు. ఆయన ఆ మాట అన్నారని, రెండేళ్లు కూర్చుని రాబర్ట్‌ కథను తయారు చేశాను. మంచి ఎమోషన్స్‌, పెద్ద కాన్వాస్‌తో.. సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌తో చేసిన చిత్రమిది. సినిమా చూసిన తర్వాత దర్శన్‌గారిని ప్రేమిస్తారు. మార్చి 11న రాబర్ట్‌ విడుదలవుతుంది. మీ ఆశీర్వాదం అందిస్తారని భావిస్తున్నాను” అన్నారు. 
నిర్మాత  ఉమాప‌తి శ్రీనివాస్ గౌడ మాట్లాడుతూ – ” సినిమా వాళ్లకి హద్దులు, భాష, కులమతాలు ఉండవు. మనమంతా ఒకటే. మార్చి 11న విడుదలవుతున్న రాబర్ట్‌ సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను” అన్నారు. 
చదలవాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – “ప్రకృతికి, సృష్టికి హద్దులు ఉండవు. అయితే భూమిపై ఉన్న వాటికి హద్దులుంటాయి. కానీ కళామతల్లికి హద్దులుండవు. బిచ్చగాడు సినిమాను చాలా ఇష్టంగా రిలీజ్‌ చేశాను. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలుసు. తర్వాత అంతే ఇష్టంతో రిలీజ్‌ చేస్తున్న చిత్రం రాబర్ట్‌. డబ్బింగ్‌ సినిమాలన్నింటిలో హయ్యస్ట్‌ థియేటర్స్‌లో విడుదల కానుంది. జగపతిబాబుగారు గొప్ప విలన్‌ పాత్రను పోషించారు. దర్శన్‌గారు తెర ముందే కాదు.. తెర వెనుక కూడా నిజమైన హీరో. నిర్మాత ఉమాపతి గొప్ప మనసున్న వ్యక్తి. కన్నడ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి మధ్య ఉన్న హద్దులు చెరిపేసే సినిమా అవుతుంది. ఆయన నిర్మాణంలో మరిన్ని గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. 
ఇంకా ఈ కార్యక్రమంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, రైటర్‌ భారవి, కాసర్లశ్యామ్‌, భాస్కర భట్ట తదితరులు పాల్గొన్నారు. 
నటీనటులు: దర్శన్‌, జగపతిబాబు, రవికిషన్‌, ఆశా భట్‌, దేవ్‌రాజ్‌, రవిశంకర్‌ తదితరులు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments