
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నిర్మాణంలోనే లోపాలు!..
హైదరాబాద్: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మలుపు శాస్త్రీయంగా లేదని ఇన్నర్ కర్వ్ ముందే మొదలు కాగా.. ఔటర్ కర్వ్ దూరం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఫ్లైఓవర్ మూసివేసిన విషయం తెలిసింది. ఈ ఫ్లైఓవర్ 20 రోజుల క్రితం ప్రారంభించిన విషయం విధితమే. ఈ 20 రోజుల్లో రెండు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు మృతి చెందారు.

నిన్న జరిగిన ప్రమాదం తీరు.. ఎలా జరిగిందనే దానిపై విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల బృందం ఆదివారం సమీక్షించనుంది.
శనివారం మధ్యాహ్నం గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్కు వద్ద మల్టీలెవల్ ఫ్లై ఓవర్. ఖాజాగూడ జంక్షన్‌వైపు నుంచి ఓ వోక్స్ వ్యాగన్ కారు.. గంటకు 105కిలోమీటర్ల వేగంతో ఆ ఫ్లై ఓవర్‌పై దూసుకొచ్చింది! అదే వేగంలో అదుపు తప్పింది..
ఫ్లై ఓవర్ మలుపు వద్ద రెయిలింగ్‌ను ఢీకొట్టి.. గాల్లోకి ఎగిరి.. 60 అడుగుల ఎత్తు నుంచి కింద రోడ్డు మీద పడింది!! మళ్లీ బంతిలా గాల్లోకి లేచి పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పడింది.
ఆ ధాటికి చెట్టు నిట్టనిలువునా కూలిపోయింది! ఫ్లై ఓవర్‌పైకి కారు ఎక్కడం మొదలు.. వంతెనపై నుంచి పడటం అంతా కూడా 5-6 సెకన్లలోనే జరిగిపోయాయి! అంతెత్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ కారు పడటంతో కింద ఉన్న జనం హాహాకారాలు చేశారు.

ప్రాణభయంతో తలోదిక్కున పరుగులు తీశారు! కొద్దిసేపటికి చూస్తే.. కారు కింద ఓ అభాగ్యురాలు.
మెడ భాగం సగం దాకా తెగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ బీభత్సాన్ని కళ్లారా చూసిన జనం గజగజ వణికిపోయారు. కొన్ని గంటల పాటు తేరుకోలేకపోయారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సీసీ టీవీల ద్వారా నిర్ధారించారు.

ఫ్లై ఓవర్‌పై నిబంధనల ప్రకారం గంటకు గరిష్ఠంగా 40కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన కారు.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుక
గంటకు గరిష్ఠంగా 40కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన కారు.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లినట్లు తేల్చారు. ఈ ఘటనలో దుర్మరణంపాలైన మహిళను మణికొండకు చెందిన కృష్ణవేణి (40)గా గుర్తించారు.
పక్కనే ఉన్న ఆమె కూతురు ప్రణీత ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకుంది. ముదావత్ బాలాజీ అనే ఆటో డ్రైవర్‌కు కాలు విరగ్గా… చెట్టు సమీపంలో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు.
ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతడిని జూబ్లీహిల్స్‌కు చెందిన కల్వకుంట్ల శ్రీధర్ రావు కుమారుడు, కృష్ణ మిలన్ (27)గా గుర్తించారు. అతడి తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి.
అంతెత్తు నుంచి కారు పడ్డా లోపల ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో అతడి ప్రాణాలు దక్కాయి. అతడిని, మిగతా క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు
