బ్రిటిష్ వాడే తిరుపతి నియమ నిబంధనలని గౌరవించాడు.
1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకం.
పిక్చరెస్క్ ఇండియా దాని పేరు.
ఇంగ్లడ్‌నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చే బ్రిటీష్ టూరిస్టుల కోసం, రైల్వే రూట్లు, స్టేషన్లు, ఆ దార్లో ఉన్న దర్శనీయస్థలాల గురించి ఇంగ్లీషులో రాసిన 650 పేజీల పుస్తకం ఇది.
అప్పటికి హైదరాబాదునుండి మద్రాస్ వెళ్ళాలి అంటే రెండు రైలు మార్గాలున్నాయి. హైదరాబాదు-వరంగల్-బెజవాడ వరకూ నిజాం రైల్వే బ్రాడ్‌గేజ్ లైన్ ఉంది.
ఇప్పుడున్న బెజవాడ-ఒంగోలు-నెల్లూరు మీదుగా మద్రాసుకి కనెక్టివిటీ ఇంకా పూర్తవ్వలేదు.
బెజవాడనుండి మీటర్‌గేజ్ ట్రెయిన్లోకి మారి గుంటూరు-వినుకొండ-నల్లమల ఫారెస్ట్-నంద్యాల-గుంతకల్ జంక్షన్ చేరుకుని, మళ్ళీ బ్రాడ్‌గేజ్ ట్రెయిన్లోకి మారి మద్రాస్ వెళ్ళాలి.
ఇది ఒక మార్గం.
రెండోది హైదరాబాదులో బ్రాడ్‌గేజ్ ట్రెయిన్ ఎక్కితే వాడి-రాయచూర్-ఆదోని-గుంతకల్ జంక్షన్ ద్వారా తాడిపత్రి-కడప-రాజంపేట-తిరుపతి-అరక్కోణం మీదుగా సరాసరి మద్రాస్ చేరుకోవచ్చు.

ఈ పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో హైదరాబాదునుండి రైల్లో బయల్దేరి మద్రాస్ చేరుకునే ప్రయాణాన్ని వివరించాడు
తిరుపతి గురించి వివరిస్తూ…
14,000 మంది జనాభా ఉండేవారని, యూరోపియన్లు తిరుమలను ‘అప్పర్ తిరుపతి’ అని పిలిచేవారని రాశాడు.
తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు.
_ఈ విషయం అతను చెబుతున్నది ఇంగ్లండునుండి వస్తున్న (క్రైస్తవ) యాత్రికులకు!!

అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ,
ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు.
పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు.

బహుశా రేపెల్లుండి ఎవరైనా పాస్టర్ కూడా తిరుమలలోకి ప్రవేశించి అక్కడున్న యాత్రికుల్ని ఆశీర్వదిస్తూ పరోక్ష మతప్రచారం నిర్వహిస్తాడేమో!!
*_నూటముప్పయి ఏళ్ళ కిందటే, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవించారు.ఎప్పటికీ గౌరవించాల్సిందే ?..