బీజేపీ తొలితరం నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) అనారోగ్యంతో కన్ను మూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి హైదరాబాద్‌లో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. దక్షిణ భారత దేశ తొలి బీజేపీ ఎంపీగా, మాజీ ప్రధాని పి వి నరసింహా రావు ను ఓటమి పాలు చేసిన నేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తిగా చందుపట్ల జంగారెడ్డికి పేరుంది.
1984 ఎన్నికల్లో వాజ్‌పేయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయ కులందరూ పరాజయం పాలయినా హన్మకొండ నుండి జంగారెడ్డి విజ యం సాధించాడు. 1984 లో భాజపా 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది… ఒకటి అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమ కొండ నుంచే కాదు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి.
18 నవంబర్ 1935 న జన్మించిన జంగారెడ్డి కొంత కాలం ప్రభుత్వ పాఠశాలలో బడిపంతులుగా పనిచేశాడు. పరకాల నియోజక వర్గం నుండి శాసనసభ్యునిగా భారతీయ జనసంఘ పార్టీ నుండి ఇండిపెం డెంట్ బి. కైలాసం పై గెలిచి శాసనస సభలో అడుగు పెట్టాడు. 1967 – 72 (పర్కల్ నుండి జనసంఘ్ సభ్యునిగా), 1978-83 (శ్యాంపేట నుండి జనతా పార్టీ సభ్యునిగా), 1983-84 (బిజెపి సభ్యునిగా శ్యాంపేట నుండి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1984లో 8వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.
1984 లో బీజేపీ 543 నియోజక వర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం నుంచి ఏకే పాటిల్ అనే బీజేపీ నేత గెలిచారు. అలా హనుమకొండ నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎంపికయిన చందు పట్ల జంగారెడ్డి, దక్షిణ భారతదేశం నుండి తొలి బీజేపీ ఎంపీగా రికార్డు సొంతం చేసుకు న్నాడు. పరకాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి1967లో శాసన సభ్యునిగా ఎన్నికై, అసెంబ్లీ లో అడుగిడిన ఆయన, 1972లో పోటీచేసి పింగళి ధర్మా రెడ్డి చేతిలో ఓటమి చెందా డు. తరువాత 1978లో మళ్ళీ పింగళి ధర్మా రెడ్డి పై శాసన సభ్యుని గా, శాయంపేట అసెంబ్లీ నియోజక వర్గం భారతీయ జనసంఘ పార్టీ నుండి విజయం సాధించాడు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడం మూలానా ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గం వారు కావడం వలన పరకాల పక్కనేఉన్న జనరల్ సీటు శాయంపేట అసెంబ్లీ నియో జకవర్గం నుండి తలపడ్డారు. మాజీ ముఖ్య మంత్రి, ఏ ఐ సి సి అధ్యక్షు లు, కాంగ్రెస్‌లో కీలక నేత, దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యులు, దివం గత ప్రధాని పాముల పర్తి వెంకట నరసింహారావు పై 54వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి దక్షిణ భారత దేశం తొలి బీజేపీ తొలి ఎంపీ గా హనుమకొండ నుండే ఎంపిక య్యాడు. 1989, 1991, 1996లో కాంగ్రెస్ పార్టీ నుండి కమాలుద్దీన్ అహ్మద్ చేతిలో జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి ఓటమి చెందాడు.
అనారోగ్యంతో బాధపడుతూ జంగారెడ్డి 5 ఫిబ్రవరి, 2022న మణించాడు. జంగారెడ్డి మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు సంతాపం తెలిపారు.