శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) గురించి తెలియని వారుండరు. భారతదేశం గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ప్రథమ డైరెక్టర్. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తొలి మొదటి ఛైర్మన్. దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఆయన స్థాపించాడు. ఆయన జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది. శాంతి స్వ రూప్ భట్నాగర్ బ్రిటిష్ ఇండియా లోని పంజాబ్ ప్రాంతంలోని, ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో, హిందూ కాయస్థ కుటుంబంలో 1894 ఫిబ్రవ రి 21న భట్నాగర్ జన్మించాడు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచు కున్నాడు. కవిత్వం లో మంచి ప్రవేశ ముండేది. బాల్యం నుండే బొమ్మలు, యంత్ర పరికరా లు చేయటంలో ఆసక్తి కనబరిచే వాడు.
తన ప్రాథమిక విద్యను దయానంద్ ఆంగ్లో-వేద ఉన్నత పాఠశాల, సికింద్రా బాద్ (బులంద్ షహర్ ) నుండి పూర్తి చేశాడు. 1911లో లాహోర్ లోని కొత్తగా స్థాపించ బడిన దయాల్ సింగ్ కాలేజీలో చేరాడు. భట్నాగర్ 1913లో పంజాబ్ విశ్వ విద్యాలయం ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడ య్యాడు. ఫోర్మాన్ క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. 1916లో భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. విదే శాల్లో చదువుకోవడానికి దయాళ్ సింగ్ కాలేజ్ ట్రస్ట్ ద్వారా స్కాలర్ షిప్ పొంది, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో 1921 లో సైన్స్‌లో డాక్టరే ట్ పొందాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, కొత్తగా స్థాపించ బడిన బనా రస్ హిందూ విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా చేరా డు. తర్వాత విశ్వ విద్యాలయం లోని ఫిజికల్ కెమిస్ట్రీ ప్రొఫెసర్, యూనివర్సిటీ కెమికల్ లాబొరే టరీస్ డైరెక్టర్‌గా లాహోర్‌కు మారాడు. మాగ్నెటోకెమిస్ట్రీ, ఫిజిక ల్ కెమిస్ట్రీ ఆఫ్ ఎమల్షన్ రంగాలలో పరిశోధనతో పాటు, అప్లైడ్ కెమిస్ట్రీ లో కూడా గణనీయమైన కృషి చేసాడు.
రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణా కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పు నీటితో కలిసి గట్టిగా రాయిలాగా మారి, డ్రిల్లింగ్ కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పనిపూర్తిగా ఆగిపోయేది. అపుడు కంపెనీవారు భట్నాగర్ ను సలహా కోరారు. భట్నాగర్ ఈ సమస్యను కూలం కషంగా పరిశీలించి అతిసులభ మైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురు కలపమని సలహా ఇచ్చా డు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటీష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయట పడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు లక్షాయాభై వేల రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మును లాహొరు యూనివర్శిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు.
భట్నాగర్ చమురు పరిశోధనా భివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఆయన తెలియ చేశాడు. కిరోసిన్ ను శుద్ధి చేయ డం, వెలుగును ఎక్కువ చేయటం, ఆదా చేయడం గురించి భట్నాగర్ విలువైన సమాచారాన్ని అందించా డు. పెట్రోలియం నుండి విడుదల య్యే వ్యర్థ పదార్ధాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో పరిశోధించాడు. ఆయన CSIR కు డైరెక్టరయ్యాడు. వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్వయం ప్రతిపత్తి సంస్థగా, 28 సెప్టెంబర్ 1942న అమలులోకి వచ్చింది.
1943లో ఆయనను ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (FRS) గా ఎన్ను కున్నారు. శాంతి స్వరూప్ భట్నాగర్… హోమీ జహంగీర్ భాభా, ప్రశాంత చంద్ర మహలనోబిస్, విక్రమ్ సారాభాయ్ తదితరులతో పాటు భారతదేశ స్వాతంత్య్రానంతర శాస్త్ర సాంకేతి క మౌలిక సదుపాయాలు, విధానా ల నిర్మాణంలో గణనీయమైన పాత్ర పోషించాడు. విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా మరియు ప్రభుత్వ విద్యా సలహాదారుగా కూడా పని చేశాడు. నేషనల్ రీసెర్చ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NRDC) ఆఫ్ ఇండియా స్థాపనలో అతను కీలక పాత్ర పోషించి, దేశంలో ఇండస్ట్రి యల్ రీసెర్చ్ అసోసియేషన్ ఉద్యమానికి నాంది పలికాడు.
భట్నాగర్ భారత దేశములో వివిధ ప్రాంతాలలో…సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ మైసూర్ , నేషనల్ కెమికల్ లాబొరేటరీ పూణే , …
