Monday, May 23, 2022
HomeEntertainmentభ‌ళా తంద‌నాన రివ్యూ

భ‌ళా తంద‌నాన రివ్యూ

Bhala Thandanana Review :

హీరో శ్రీవిష్ణు, కేథ‌రిన్ జంట‌గా న‌టించిన చిత్రం భ‌ళా తంద‌నాన‌. ఈ చిత్రానికి బాణం ఫేమ్ చైత‌న్య దంత‌లూరి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో భ‌ళా తంద‌నాన సినిమా పై ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ సినిమాని చూశాన‌ని.. చాలా బాగుందని చెప్ప‌డంతో భ‌ళా తంద‌నాన పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ రోజు అన‌గా మే 6న భ‌ళా తంద‌నాన విడుద‌లైంది. మ‌రి.. భ‌ళా తంద‌నాన టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా భ‌ళా.. అనిపించుకుందా..? ప్రేక్ష‌కుల‌ని మెప్పించిందా..? లేదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

క‌థ విష‌యానికి వ‌స్తే… శ‌శిరేఖ (కేథ‌రిన్) ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్. ఓ అనాథాశ్ర‌మం పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం అంద‌డంతో న్యూస్ క‌వ‌ర్ చేయ‌డానికి అక్క‌డ‌కు వెళుతుంది. అయితే.. ఆ టైమ్ లో అక్క‌డే ఉన్న చందు అలియాస్ చంద్ర‌శేఖ‌ర్ (శ్రీవిష్ణు)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త స్నేహంగా మారుతుంది. ఇదిలా ఉంటే.. సిటీలో వ‌రుస‌గా హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్‌ ఆనంద్‌ బాలి (గరుడ రామ్‌) మనుషులు అని తెలుస్తోంది.

Bhala Thandanana Review
Bhala Thandanana Review

ఇక అప్ప‌టి నుంచి ఈ కేసుని సీరియస్‌ తీసుకొని స్టడీ చేస్తుంది జ‌ర్న‌లిస్ట్ శశిరేఖ. ఈ క్రమంలో ఆనంద్‌ బాలి దగ్గర ఉన్న 2000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్త‌ను ప్ర‌పంచానికి జ‌ర్న‌లిస్ట్ శ‌శిరేఖే తెలియ‌చేస్తుంది. ఇక అక్క‌డ నుంచి ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంత‌కీ 2000 కోట్ల‌ను దొంగ‌లించింది ఎవ‌రు..? ఈ కేసుతో చందుకు ఉన్న లింకు ఏంటి..? అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ – హీరో శ్రీవిష్ణు పాత్ర స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని న‌టించాడు. ఫ‌స్టాఫ్ లో అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తిగా.. సెకండాఫ్ లో డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న వ్య‌క్తిగా చాలా చక్క‌గా న‌టించాడు. త‌న గ‌త చిత్రాల‌తో పోలిస్తే.. ప‌రిణితి చెందిన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. ఇక కేథ‌రిన్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ గా మెప్పించింది. ఈ సినిమాలో త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంది. అది సెట్ కాలేదు. అయితే.. మేడ‌మ్ మీరు తెలుగు మాట్లాడితే.. ఇంగ్లీషు మాట్లాడిన‌ట్టు ఉంద‌ని ఓ స‌న్నివేశంలో హీరోతో చెప్పించి ప్రేక్ష‌కుల‌ను క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

Bhala Thandanana Review
Bhala Thandanana Review

విల‌న్ గా గ‌రుడ రామ్ మెప్పించాడు కానీ.. అత‌నికి బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం మైన‌స్ అని చెప్ప‌చ్చు. పోసాని, స‌త్య త‌న‌దైన స్టైల్ లో న‌టించి న‌వ్వించారు. ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్ అంటే.. మ‌ణిశ‌ర్మ అని చెప్ప‌చ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొన్ని స‌న్నివేశాల‌కు ప్రాణం పోశారు. ఇక ద‌ర్శ‌కుడు చైత‌న్య దంత‌లూరి చాలా గ్యాప్ త‌ర్వాత ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించారు. పాయింట్ కొత్త‌గానే ఉంది కానీ.. దీనికి ల‌వ్ అండ్ కామెడీ యాడ్ చేసి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదే సినిమాకి పెద్ద మైన‌స్ అని చెప్ప‌చ్చు. ఈ క‌థ‌లో కావాల్సిన ట్విస్టులు ఉన్న‌ప్ప‌టికీ… ల‌వ్ అండ్ కామెడీ సీన్స్ పెట్ట‌డంతో క‌థ ట్రాక్ త‌ప్పిన‌ట్టు అయ్యింది. అలాగే మెయిన్ స్టోరీలోకి వెళ్ల‌డానికి ఎక్కువ‌ టైమ్ తీసుకోవ‌డం కూడా ఓ మైన‌స్ అని చెప్పచ్చు. క్లైమాక్స్ కొత్త‌గా ఉంది కానీ.. అసలు హీరో ఎవరు? అతని గతం ఏంటి? 2000 కోట్లు ఎక్కడ దాచాడు? అనే విషయాలను తెలియజేయకుండా.. రెండో భాగం ఉందని చెప్పి క‌థ‌ను ముగించారు. సైడ్ ట్రాకులు లేకుండా.. క‌థ పై ఇంకాస్త క‌స‌ర‌త్తు చేసుంటే… బాగుండేది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. భ‌ళా…అనిపించేలేక‌పోయిన భ‌ళా తంద‌నాన‌.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort