Tuesday, August 9, 2022
HomeLifestylespecial Editionభగత్ సింగ్ వర్ధంతి

భగత్ సింగ్ వర్ధంతి


భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 – 1931 మార్చి 23) భారత స్వాతంత్య్ర సమర యోధుడు, కరుడుకట్టిన ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవ కారులలో ఆయన ఒకడు. ఆ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా నేటికీ కొనియాడ బడుతున్నాడు.

భగత్ సింగ్ పూర్వపు పంజాబ్‌లో, ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలోని సంధు ఝాట్ కుటుంబంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి దంపతులకు జన్మించా డు. భగత్ అనే పదానికి “భక్తుడు” అని అర్థం. భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు తండ్రి కిషన్ సింగ్, భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరక లను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి “ఏం చేస్తున్నావ్ నాన్నా” అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ” తుపాకులు నాటుతున్నా” అని బదులిచ్చాడు. భవిష్యత్తుకు బాల్యం మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం ఆయన వ్యక్తిత్వానికి మచ్చుతునక.
13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణో ద్యమానికి సింగ్ ప్రభావితుడ య్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు.

లాలా లజ్‌పత్ రాయ్ మరణం, సాండర్స్ హత్యల తరువాత 1928 లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
‌ భారత దేశానికి వచ్చిన సైమన్‌ కమిషన్లో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా, ఉద్యమంలో
లాల్‌జీ కీలక పాత్ర వహించి, సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలి అంటూ పంజాబ్‌ అసెంబ్లీలో ఆయన తీర్మానం పెట్టి గెలిపిం చారు. ఇది ప్రభుత్వానికి కంటగిం పుగా మారింది. అక్టోబర్‌ 30, 1928న ఆ కమిషన్‌ లాహోర్‌ రాగా, లాల్‌జీ కూడా అహింసతో, మౌనం గా సైమన్‌ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మౌనంగా ఉద్యమి స్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెం డెంట్‌ జేమ్స్‌ ఏ స్కాట్‌. తను స్వయంగా లాల్‌జీ మీద దాడి చేసి, లాల్‌జీ ఛాతీ మీద లాఠీ తో స్కాట్‌ తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలతోనే లాల్‌జీ నవంబర్‌ 17న చని పోయారు.
ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చు కోవాలని నిర్ణయించు కున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హత మార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్, సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. డీఎస్పీ జే. పీ. సాండర్స్ కనిపించినప్పుడు పొర పాటుగా స్కాట్‌ అనుకుని, జైగో పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. ఫలితం గా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హత మార్చి నందుకు గాను వారికి 1930లో అక్టోబర్ 7వ తేదీని ఈ మరణ శిక్షను ఖరారు చేశారు.

భగత్ సింగ్ సహా ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేసిన తీర్పు వివరాలను 2015లో ప్రచురించారు. ‘Warrant of Execution On Sentence Of Death’ అనే విడుదల చేసిన పత్రంలో 1930 అక్టోబర్ 7వ తేదీన ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చినట్లు స్పష్టంగా ఉంది. 1931, మార్చి 23న ఉరిశిక్ష అమలు చేసినట్లు మరో పత్రంలో వివరాలు ఉన్నాయి. జైలు సూపరింటెండెంట్ సంతకం చేసిన పేపర్‌ను టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ గుర్తించి బహిర్గతం చేసి, లాహోర్‌ లోని పంజాబ్ శాఖలో ఈ పత్రాలను ఇటీవల ప్రదర్శనకు ఉంచారు.

1930 అక్టోబర్ 7 న న్యాయ స్థానము తీర్పును వెలువరించింది. తీర్పు 281 పేజీల్లో ఇవ్వబడింది. విచారణ ఎదుర్కొన్న వారందరికీ ఇలా శిక్షలు ఇవ్వబడ్డాయి. ఉరిశిక్ష: 1.భగత్ సింహ్ 2. సుఖఃదేవ్ 3. రాజగురులకు; అలాగే ఆజన్మాంతర జీవిత ఖైదు: 1.కిశోరీలాల్ 2. మహావీర్ సింహ్ (అండమాన్లో 9 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడు. 3. విజయ్ కుమార్ సింహ్ 4. శివవర్మ 5. గయా ప్రసాద్ 6. జయ దేవ్ కపూర్ 7. కమల్నాథ్ తివారిలకు; అలాగే జీవిత ఖైదు: 1.కుందాన్లాల్ ( 7 సంవత్సరాలు) 2. ప్రేమదత్ ( 5 సంవత్సరాలు)లకు; అలాగే
అజయ్ ఘోష్, సురేంద్రనాథ్ పాండియ ఇంకా జితేంద్రనాథ్ సన్యాల్ లను విడిచి పెట్టారు. విచారణ లో ఉన్నవారందరూ కోర్టులను బహిష్కరించడం వలన తీర్పును లాహోర్ లోని సెంట్రల్ జైలు లో వినిపించారు.

తమను యుద్ధ ఖైదీలుగా గుర్తించడం ద్వారా ఉరి తీయ కుండా కాల్పుల బృందం చేత హతమార్చాలని జైలులో ఉన్నప్పుడు భగత్ సింగ్‌ , మరో ఇద్దరు వైస్రాయికి లేఖ రాశారు. క్షమాభిక్ష ముసాయిదా లేఖపై సంతంకం కోసం భగత్ సింగ్‌ మిత్రుడు ప్రన్నత్ మెహతా ఆయన్ను ఉరితీయడానికి నాలుగు రోజుల ముందు మార్చి 20న జైలులో కలిశాడు. అయితే సంతకం చేయడానికి సింగ్ నిరాకరించాడు.

మార్చి 23న ఉరితీసినట్లు జైలు అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని విడుదల చేశారు.
అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ వి.ఎన్. స్మిత్ ప్రకారం, భగత్ సింగ్‌ను ముందుగానే ఉరితీశారు.
సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించుకుని..సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరి తీశారు.

భగత్ సింగ్ వీర మరణం వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్ర్యోద్యమము వైపుకు మరల్చింది.

భగత్ సింగ్ మరణం భారత స్వాతంత్ర్యోద్యమ కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments