5.1 C
New York
Saturday, March 25, 2023
HomeNewsబెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం1 ప్రారంభం!!...

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం1 ప్రారంభం!! _Ts360News.com

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

ముహూర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటుచేసిన విలేఖ‌రుల సమావేశంలో…

ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ `ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌బోతోంది. డిసెంబ‌ర్ 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో చిత్రీక‌రణ జ‌ర‌ప‌బోతున్నాం.

వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో సాయిశ్రీనివాస్ క‌నిపిస్తాడు.  త‌న కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి, చిత్ర నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గారికి ధ‌న్య‌వాదాలు. బిజీ షెడ్యూల్ లో కూడా మా సినిమాకు అంగీక‌రించిన దేవిశ్రీ ప్ర‌సాద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ `ద‌ర్శ‌కుడు సంతోష్ కందిరీగ సినిమా నుండి పరిచయం. తనతో వ‌ర్క్ చేయ‌డం నా కుటుంబ స‌భ్యుల‌తో చేసిన‌ట్టుగా ఉంది. మంచి పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్ట‌ర్.

నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను. సభా నటేష్ కూడా పెర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది. అల్లుడు శీను, జ‌య‌జాన‌కి నాయ‌క త‌ర్వాత దేవిశ్రీ ప్ర‌సాద్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.

మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన వి.వి.వినాయ‌క్, దిల్ రాజు, జెమినీ కిర‌ణ్ గార్ల‌కి థ్యాంక్స్` అని అన్నారు.

నిర్మాత‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ `నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సురేష్, పద్మ గార్లకి  ధన్యవాదాలు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ గా రూపొందిస్తున్నాం. డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’ అన్నారు.

`ఇస్మార్ట్ బ్యూటీ` న‌భా న‌టేష్ మాట్లాడుతూ `సాయిశ్రీనివాస్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. న‌ట‌న‌కి ఆస్కార‌మున్న పాత్ర పోషించ‌నుండ‌టం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన‌ దర్శకనిర్మాతలకు కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ డుడ్లీ మాట్లాడుతూ `స్వస్థ‌లం చెన్నై అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్ లో ఎన్నో  సూప‌ర్ హిట్ చిత్రాల‌కు వ‌ర్క్ చేశాను. తెలుగులో నా తొలిచిత్రం. ఎంతో ఫ్యాష‌నేట్ ఇండ‌స్ట్రీ అయిన టాలీవుడ్ లో వ‌ర్క్ చేయ‌నుండ‌టం సంతోషంగా ఉంది` అన్నారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ `స్టోరీ చాలా బాగుంది. ట్రైమండ‌స్ హిట్ కొడ‌తామ‌నే న‌మ్మ‌క‌ముంది` అన్నారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా న‌టిస్తున్న ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్ల‌, ఎడిట‌ర్: త‌మ్మిరాజు, మాట‌లు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత: గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం, స్టోరీ, స్కీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్ష‌న్: సంతోష్ శ్రీనివాస్.

Bellamkonda Srinivas’s upcoming project launched today

Bellamkonda Srinivas is all set to join hands with Santosh Srinivas next. This film was formally launched in Ramanaidu Studios today.

Srinivas will be romancing ‘Ismart Shankar’ beauty, Nabha Natesh in this yet-to-be-titled  film.

Dil Raju directed the first shot and Gemini Kiran switched on the camera. VV Vinayak hit the first clap in the launch event.

The movie unit will kick-start regular shoot from December 6th in Hyderabad.

G Subrahmanyam will bankroll this film on Sumanth Movie Productions banner. Devi Sri Prasad will compose the tunes and Dudley will be the cinematographer for this out-and-out entertainer.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments