నూతనకల్ మండలం లో తాళ్ళ సింగారం లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి
నూతనకల్ మండల MPP కళావతి గారు ZPTC కందాల దామోదర్ రెడ్డి గారు,గ్రామ సర్పంచ్ చూడి లింగారెడ్డి గారు ముఖ్య అతిధులుగా హాజరై బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా MPP గారు ZPTC గారు సర్పంచ్ లింగారెడ్డి గారు మాట్లాడుతూ
★ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఆడపడుచులందరికీ పెద్దన్నలా వ్యవహరిస్తూ అట్టహాసంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
★ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆత్మ గౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన
★ ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు చీరలు అందించడమనేది మన సంస్కృతిలో భాగం
★ మహిళా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి
★ కుల మతాలకతీతంగా ప్రజలందరికీ సమానమైన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది
ఈకార్యక్రమంలో తాళ్ళ సింగారం ఉప సర్పంచ్ పరమేష్ గారు గ్రామ వార్డ్ మెంబర్స్ యడవల్లి MPTC నరేష్ గారు మండల నాయకులు తాడూరి లింగయ్య గారు J Vయాదవ్ గారు తదితరులు హాజరయ్యారు