జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఏప్రిల్ 24న భారతదేశంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడం కోసం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంతో ఈ దినోత్సవం నిర్వహించ బడుతుంది.
భారత దేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థలవ్యవస్థ. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి పనివారల ప్రతినిధులతో పనిచేయగా, బ్రిటిష్ పాలన కాలంలో గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వ పరిపాలనా సంస్థలు రూపు దిద్దుకున్నాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంత వీటికి బలం చేకూర్చాయి. భారత దేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబరు 1న, ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా, మహబూబ్ నగర్ జిల్లా, షాద్‌నగర్లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయి లో జిల్లా పరిషత్ ఏర్పడింది. 1986లో బ్లాకు స్ధాయి వ్యవస్థని మండల పరిషత్ గా మార్చారు.కేంద్ర ప్రభుత్వ చొరవతో ప్రయోగా త్మక ప్రాతిపదికగా, సమాజ వికాసా భివృద్ధి కార్యక్రమం (కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) 1952లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో బాగా వెనుక బడిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా సౌకర్యా లు, కుటీర పరిశ్రమలు అనే ఐదు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 1953లో ఈ పథకాన్నే జాతీయ విస్తరణ సేవా పథకం (నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ స్కీమ్) గా దేశ మంతటా అమలు చేశారు. ఈ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయడానికి బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన నిపుణుల కమిటీ ని 1956లో నియమించా రు. ఈ కమిటీ తన నివేదికను 1957లో సమర్పించింది. ఈ కమిటీ సిఫారసులే పంచాయతీరాజ్ వ్యవస్థ (ప్రజాస్వామ్య వికేంద్రీకరణ) ఏర్పాటుకు మూలాధారం అయినాయి.బల్వంతరాయ్ మెహతా (1900 ఫిబ్రవరి 19 – 1965 సెప్టెంబరు 19) స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త, పంచాయితీ రాజ్ నూతన వ్యవస్థ మార్గదర్శకుడు. ఆయన బర్డోలి సత్యాగ్రహ భాగస్వామి. గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. స్వయం పాలన కోసం ప్రజల పోరాటం ఆయన జీవితా శయం. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సంబంధంగా… “బల్వంతరాయ్ మెహతా కమిటీ” సిఫార్సులు దేశంలో అమలు పరచబడి, ప్రాచుర్యం పొందిన పంచాయితీ రాజ్ అనే విప్లవాత్మక కార్యక్రమంతో మెహతా గుర్తింపు పొందాడు.స్వాతంత్ర్యం తరువాత మెహతా భారతదేశ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యా డు. పార్లమెంట్ అంచనా కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ప్రణాళిక ప్రాజెక్ట్స్ కమిటీ అధ్యక్షుడుగా రాష్ట్రాలలో మూడు అంచెల వ్యవస్థ స్థాపన కోసం మెరుగైన విధానానికి అద్భుతమైన నివేదికను సిద్దం చేశాడు. తద్వారా భారత దేశపు పంచాయితీ రాజ్ ఫాదర్‌గా ప్రశంసించ బడ్డాడు.1952, అక్టోబరు 2న ప్రవేశ పెట్టిన సమాజ అభివృద్ధి కారక్రమం ప్రాతి పదికగా, జాతీయాభివృద్ధి మండలి 1957, జనవరి, 16న బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1953, అక్టోబరు 2న ప్రవేశ పెట్టిన జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పథకాలు ఎంతవరకు విజయవంతం అయినాయో సమీ క్షించి, గ్రామ పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమయ్యే సంస్థాగత ఏర్పాటును సిఫార్సు చేసింది.బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో 3 – అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ను సిఫారసు చేస్తూ, తన నివేదిక ను 1957, నవంబరు 24న జాతీ యాభివృద్ధి మండలికి సమర్పించిం ది. కమిటీ నివేదికను జాతీయా భివృద్ధి మండలి 1958, జనవరిలో ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల అమలు వివిధ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థఏర్పాటుకు ప్రయత్నించాయి.భారత దేశంలో 1959 అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగూర్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను లాంచ నంగా ప్రారంభించారు. రాజస్థాన్ రాష్ట్రంలో, నాగోర్ జిల్లాలోని, సికార్ అనే ప్రాంతంలో ఈ విధానా న్ని ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభిస్తూ చేసిన వ్యాఖ్యానం…”నేడు ప్రారంభమ వుతున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి”. మూడు అంచెల విధానాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1959, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వద్ద నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ ప్రారంభించారు. బల్వంతరాయ్ మెహతా కమిటీ చేసిన ముఖ్యమైన సిఫార్సులు… దేశంలో 3 అంచెల పంచాయతీ రాజ్ విధానం ఏర్పాటు చేయాలి.1) జిల్లా స్థాయిలో – జిల్లా పరిషత్, 2) బ్లాకు స్థాయిలో – పంచాయతీ సమితి, 3) గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీప్రజల భాగస్వామ్యం కల్పించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను నెలకొల్పాలి. గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నిక లను నిర్వహించాలి. ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన కాకుండా, స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలి. స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమ బద్ధంగా ఎన్నికలు జరపాలి. స్థానిక సంస్థలకు తగిన అధికారాలను, ఆర్థిక వనరులను సమకూర్చాలి. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానికసంస్థల ద్వారానే నిర్వహించాలి. స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టరు కీలకపాత్ర పోషించాలి. కింది స్థాయి లో మినహాయించి, మాధ్యమిక, ఉన్నత స్థాయుల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి. అధికారాల, పరి పాలనా, వనరుల, ప్రణాళికా, ప్రజాస్వామ్య వికేంద్రీకరణలు జరగాలి. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించింది. స్థానిక సమస్యలను స్థానికంగా పరిష్కరించడం, ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయడం పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం స్వాతంత్య్రానంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనవంతు కృషి చేస్తూనే ఉన్నాయి.
