Thursday, June 30, 2022
HomeLifestyleDevotionalఅమెరికా, లండన్ లలో ‘బాచంపెల్లి’ ప్రవచనాలు

అమెరికా, లండన్ లలో ‘బాచంపెల్లి’ ప్రవచనాలు

శృంగేరీ మహా సంస్థాన ఆస్థాన పౌరాణీకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చే పలు మార్లు సన్మానితులు, ధర్మపురి క్షేత్రానికి చెందిన డాక్టర్ బాచంపెల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ప్రస్తుతం విదేశాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు గావిస్తున్నారు.
సంతోష్ కుమార్ శాస్త్రి ధర్మపురి క్షేత్రంలో 1976 ఫిబ్రవరి 11న జన్మించి, బి.ఏ లిటరేచర్, ఎంఏ తెలుగు, సంస్కృతం పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ విభాగంలో ప్రధముడుగా నిలవడమేకాక, తెలుగులో 3బంగారు పతకాలు సాధించి విశ్వవిద్యాలయ రికార్డు నెల కొల్పారు. కృష్ణ యజుర్వే దాధ్య యనం, ఆగమ శాస్త్రాధ్యయనం గావించి, ప్రముఖ పౌరాణి కులు మాణిక్యశాస్త్రి పౌత్రునిగా, హిందీ సాహిత్య రత్న నరహరి శర్మ పుత్రినిగా, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి ప్రియశిష్యునిగా, శృంగేరీ పీఠ ఆస్థాన పౌరాణికులుగా గుర్తించ బడినారు.
గతంలో తేజ, జడ్ టివిలలో తిరుప్పావై తదితర అంశాలపై చేసిన ప్రవచనాలు, ఈటీవీలో ప్రవచనాలు, ఎన్టీవీ, భక్తి టీవీ లలో కోటి దీపోత్సవం కార్యక్రమాలలో, ఇతర ఛానళ్లలో, ప్రవచనాలు ప్రతిష్ఠను ఇనుమడింప చేశాయి. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ జనరల్ మేనేజర్ (ప్రోగ్రాం)గా లబ్దప్రతిష్ఠు లైన శాస్త్రి “ఆర్ష విజ్ఞాన కరదీపిక” లాంటి గ్రంథా లెన్నో రచించారు. 2007 నుండి ఇంగ్లాండు, బర్మిం గాం, ట్యూంవర్త్ లాంటి విదేశాలకు ప్రవచనాలకై వెళ్ళి వచ్చారు.
1997లో పౌరాణిక ప్రవర, 2000లో పురాణ వాచస్పతి, 2001లో పౌరాణిక రత్న అవార్డులు పొంది, శృంగేరి, గుంటూరు, విజయవాడ, చండీఘర్, ముంబై, అమృతసర్, బెంగుళూరు, లండన్, అమెరికా లాంటి రాష్ట్ర తర ప్రాంతాలలో పలు జ్ఞాన యజ్ఞాలు, సుందరా కాండ భగవద్గీత సప్తాహాలను నిర్వహించి, అష్టాదశ పురాణాలు ప్రవచనాలు గావించారు. దూరదర్శన్, ఈటివితోపాటు వివిధ తెలుగు ఛానెళ్ళలో నృసింహ వైభవం, తదితర ప్రవచనాలు గావించి, టివి 9లో భద్రాచల సీతారామ కళ్యాణం గురించి, భక్తి ఛానల్ ద్వారా తిరుపతి వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. నైమిశారణ్యంలో పురాణ ప్రవచనాలు నిర్వహించా రు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిలిం టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా 2008 టివి నంది అవార్డులలో బాచంపెల్లి సంతోష్ కుమార్ కు గురుదేవో భవకు సంబంధించి ఉత్తమ యాంకర్ గా నంది అవార్డు అందుకున్నారు.

ఇటీవలి కాలంలో ధర్మపురి క్షేత్ర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో నిర్వహించే శ్రీ స్వామి వారి కల్యాణోత్సవ ప్రత్యక్ష ప్రసారంలో క్రమం తప్పకుండా పాల్గొంటు న్నారు. అలాగే రాష్ట్రంలో లబ్దప్రతిష్ఠులైన సంగనభట్ల మాణిక్య శాస్త్రి పౌత్రులైన సంతోష్ శాస్త్రి, ధర్మపురి భాగవత సప్తాహ కార్యక్రమ పరంపరను కొనసాగించే నిర్ణయం గైకొని, స్థానిక మహిళా మండలి, బ్రాహ్మణ సంఘాల సౌజన్యంతో ప్రారంభించి, ప్రస్తుతం పురిటిగడ్డపై భాద్రపద మాసంలో భాగవత సప్తాహ ఆధ్యాత్మిక ప్రవచనాలను ధర్మపురి బ్రాహ్మణ సంఘం భవనంలో భాగవత పురాణ సప్తాహాలు నిర్వహిస్తు న్నారు. ఇటీవలే కాశీ క్షేత్రంలో గంగానదిలో పడవలో ఏడు రోజుల పాటు భాగవత పురాణ ప్రవచనాలు నిర్వహించారు.

పిన్న వయసులోనే ఇంతటి లబ్ధ ప్రతి షులై, ఉస్మానియా విశ్వ విద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన సంతోష్ కుమార్ శాస్త్రి తెలంగాణ ప్రభుత్వం పక్షాన నిర్వహించే ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాలలో వరుసగా పంచాంగ పఠనం గావించి, సిఎం కేసిఆర్, చీఫ్ సెక్రటరీలు, దేవాదాయ శాఖ మంత్రి, కమీషనర్ ద్వారా సన్మానితులైనారు.

ప్రస్తుతం అమెరికా లో పలు ప్రాంతాలలో తెలుగు వారి ఆహ్వానాల మేరకు పురాణ, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహి స్తున్నారు. సంతోష్ కుమార్ శాస్త్రి ఏప్రిల్ 7వ తేదీ హైదరాబాద్ నుండి లండన్ బయలుదేరి లండన్ లో శ్రీరామనవమి కళ్యాణం, నారాయణీయం సప్తాహం నిర్వహిం చారు. తర్వాత ఏప్రిల్ 14వ తేదీ లండన్ నుండి వెళ్ళి, శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా డబ్లింగ్ నగరంలో పంచముఖ ఆంజనేయ దేవాలయం లో సుందరకాండ సప్తాహం, మౌంటెన్ హౌస్ ప్రాంతంలో భాగవత ప్రవచన ములు, సియాటెల్ ఎల్ వి టెంపుల్ లో ఒకరోజు హనుమత్ వైభవం ప్రవచనం, పోర్ట్ ల్యాండ్ లో హనుమాన్ చాలీసా ప్రవచనం, మే 1వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు న్యూయార్క్ న్యూజెర్సీ లలో శివ విష్ణు టెంపుల్ లో ఆది శంకరా చార్య జయంతి ఉత్సవాల సందర్భంగా శంకర విజయం వివేకచూడామణి పై ప్రవచన ములు, అట్లాంటా మహా నగరంలో హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో నరసింహ వైభవం ప్రవచనం, నార్త్ ఇండియన్ శివ టెంపుల్ లో శివ వైభవ ప్రవచనములు, టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో మూడురోజుల సుందరకాండ ప్రవచనం, అమెరికా దేశ క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ డి.సి లో నరసింహ జయంతి ఉత్సవా లలో పాల్గొన్నారు. అమెరికా నుండి మే 16వ తేదీ బయలుదేరి లండన్ నగరం చేరుకొని మే 17, 18, 19 తేదీల్లో లండన్ మాంచెస్టర్ మొదలైన నగరాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పి, మే 22వ తేదీ లండన్ నుండి విదేశీ పర్యటన ముగించు కుని భాగ్యనగరానికి చేరుకో నున్నారు.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments