పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని ‘సర్పెంటాలజీ’ లేదా ‘ఒఫియాలజీ’ అంటారు. ప్రతి సంవత్సరం జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవం జరుపుకుంటారు. భారత దేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. పాములు లేదా సర్పాలు పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచ మంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.
భారతదేశంలో అనేక రకాల పాములు ఉన్నా వాటిలో విషపూరిత మయినవి కొన్ని మాత్రమే. ముఖ్యంగా నాగుపాము, రక్త పింజరి, కట్లపాము, రాచనాగులలో విషం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారత దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు. 50వేల మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా. ప్రపంచంలో ఒక్క ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3 వేల జాతుల పాములున్నాయి. మన దేశంలో ఉన్న 250 జాతులలో 52 విష సర్పాలు. అమెరికా, ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో పాము కాటు మరణాలు పదుల సంఖ్యల్లో ఉంటున్నాయి. అతి పొడవైన పాము…అనకొండ, దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు. (18 అడుగులు). అతి చిన్న పాము త్రెడ్ పాము…పొడవు 11 సె.మీ. (4.4 అంగుళాలు). వెస్ట్ ఇండీస్ లో కనబడుతుంది. అతి పొడుగాటి కోరలు గల పాము గబూన్ వైపర్… వీటి కోరలు 5 సె.మీ. (2 అంగుళాలు) కంటే ఎక్కువ. అత్యధిక వేగంతో ప్రాకే పాము… ఇది గంటకు 19 కి.మీ. (12 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది. పాములు పూర్తిగా మాంసాహారులు. ఈ పరభక్షకాలు ఎక్కువగా బల్లులు, చిన్న పాములు, జంతువులు, పక్షులు, గుడ్లు, చేపలు, కీటకాలు భుజిస్తాయి. కొన్ని దేశాలలో పాముల్ని ఆహారంగా తింటారు.
పాము కాటు వేయటం ద్వారా తన కోరలతో ఏర్పరచిన గాయాన్ని పాముకాటు అంటారు. పాముకాటు విషపూరిత మైనది. అయితే పాము జాతుల యొక్క అధిక భాగం విషపూరితం కానివి ఉన్నాయి. సాధారణంగా ఇవి విషంతో కంటే అదుముట ద్వారా వేటాడిన ఆహారాన్ని చంపుతాయి, విష పూరిత పాములు అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోను కనబడతాయి. పాములు తరచుగా వేట పద్ధతిగా వాటి ఆహారాన్ని కరుస్తాయి, కానీ ఇతర ప్రాణుల నుంచి రక్షించుకునేందుకు తమను వేటాడే వాటిని కూడా కరుస్తాయి.
అన్ని పాముకాట్ల యొక్క అత్యంత సాధారణ లక్షణాలు అధిక భయం, కలవరం, మానసిక అస్థిరత్వం, ఈ లక్షణాలు వికారం, వాంతులు, అతిసారం, తల తిరుగుట, మూర్చ, గుండె వేగంగా కొట్టుకోవడం, చల్లని, తడి గల చర్మం వంటి వాటికి కారణం కావచ్చు.
పాము కాటుకు గురైన రోగికి ముందు ధైర్యం చెప్పాలి. విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటివెంట నురుగు, చూపు రెండు దృశ్యాలు కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వం టి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రి పెరాల్టిక్, పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీ వెనమ్ డోసు ఇవ్వాలి. చాలా ప్రాంతాల్లో పాము కాటు విషానికి సరైన విరుగుడు చికిత్స అందుబాటులో లేకే బాధితులు పెరుగుతున్నారు.
వ్యక్తిని ప్రశాంతంగా ఉంచాలి. తీవ్రమైన ఒత్తిడి చర్యల వలన రక్త ప్రవాహం పెరుగుతుంది, వ్యక్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. గాయపడిన వ్యక్తి భయాందోళనలకు, కలవర పాటుకు గురి కాకుండా సానుకూలంగా ధైర్యం చెప్పాలి.
రవాణా ఏర్పాట్ల కోసం, సమీపం లోని ఆసుపత్రి అత్యవసర గది కోసం “కాల్ ఫర్ హెల్ప్”కు ఫోన్ చేయాలి. సాధారణంగా అన్ని ప్రాంతాల ఆసుపత్రులలో తరచుగా పాము విషానికి విరుగుడు మందు ఉంటుంది.
గుండె, శరీరం యొక్క ఇతర అవయవాలకు పాముకాటుకు గురైన అంగం నుండి రక్త సరఫరాను తగ్గించేందుకు పాముకాటుకు గురైన అవయవము గుండె స్థాయికి క్రింద ప్రయోజనాత్మక స్థానంలో ఉంచేందుకు కచ్చితంగా ప్రయత్నించాలి. అమెరికన్ మెడికల్ అసోసియేషన్, అమెరికన్ రెడ్ క్రాస్ సహా అనేక సంస్థలు పాముకాటును సబ్బు, నీటితో శుభ్రం చేయ వచ్చునని సిఫార్సు చేశాయి.
పాముకాటుకు గురైన వ్యక్తికి తినేందుకు లేదా తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు. ముఖ్యంగా వినిమయ మద్యం ముఖ్యమైనది. ఇది ఉద్రేకాన్ని పెంచి విషాన్ని రక్తనాళాలలో వేగంగా కలిసేలా చేస్తుంది. ప్రత్యేకంగా వైద్యుని ఆధ్వర్యంలో మినహా ఉత్ప్రేరకాలు లేదా నొప్పి మందులు ఇవ్వకూడదు. కాటుకు గురైన అవయవమును బిగుతుగా చేసి వాపుకు గురి చేయగల వస్తువులను లేదా దుస్తులను తొలగించాలి (వలయాలు, కంకణాలు, గడియారాలు, పాదరక్షలు, మొదలైనవి).
సాధ్యమైనంత వరకు వ్యక్తిని మాట్లాడకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంచండి.
కరచిన చోట కోయ కూడదు.
పాము కరచిన చోట ఉన్న గాయంపై ఒక సిరంజిని ఉంచి వాక్యూం పద్ధతి ద్వారా ఆ గాయం నుంచి రక్తాన్ని పీల్చేలా చేసి విషాన్ని తొలగించు కోవాలి.. పాము కరచిన వెంటనే సిరంజి ద్వారా విషాన్ని తొలగించి నట్లయితే గండం గట్టేక్కినట్లే.
