Monday, May 23, 2022
HomeEntertainment'అశోకవనంలో అర్జున కళ్యాణం' మూవీ రివ్యూ

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ రివ్యూ

Ashoka Vanamlo Arjuna Kalyanam Review :

విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ హీరో హీరోయిన్స్ గా… రితికా నాయక్, గోపరాజు రమణ, రాజ్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో డైరెక్టర్ విద్యాసాగర్ చింత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమాకు జై క్రిష్ సంగీతాన్ని అందించగా… ఎస్.వి.సి.సి డిజిటల్ మరియు సినిమా నిర్మాణంపై బాపినీడు.బి, సుధీర్ ఈదర నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు (6 మే, 2022) ఈ సినిమా విడుదల అయ్యింది. మొత్తానికి కొన్ని వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే…

Ashoka Vanamlo Arjuna Kalyanam Review
Ashoka Vanamlo Arjuna Kalyanam Review

కథ :
సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేస్తున్న అల్లం అర్జున్ (విశ్వక్ సేన్) కథను వివరిస్తుంది. ఇక అతని వయసు 34 ఏళ్లు వచ్చినా కూడా అతడికి ఇంకా పెళ్లి కాకపోవటంతో ఇంట్లో వాళ్లతో పాటు సమాజం కూడా అతడిని నానా రకాల మాటలతో ఆడిపోసుకుంటుంది. అయినా కూడా అతడు అవన్నీ పట్టించుకోకుండా తనను చేసుకోబోయే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆయన కులానికి చెందిన అమ్మాయిలు దొరకకపోయే సరికి వేరే కులానికి చెందిన అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు. దాంతో ఆయనకు గోదావరి కి చెందిన పసుపులేటి మాధవి (రుక్సార్) దొరుకుతుంది. కానీ ఆమె అతడిని పట్టించుకోదు. అతడిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడదు. దీంతో చివరికి అర్జున్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా.. అసలు ఆ అమ్మాయి అతడిని ఎందుకు పట్టించుకోదో అనేది మిగిలిన కథ..

నటీనటుల విషయానికి వస్తే…
ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర, నటన హైలెట్ గా ఉంది. డైరెక్టర్ ఈ కథకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకున్నాడు. మొత్తానికి విశ్వక్ సేన్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ రుక్సార్ మాత్రం తన పాత్రతో బాగా హైలెట్ గా నిలిచింది. ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి.

Ashoka Vanamlo Arjuna Kalyanam Review
Ashoka Vanamlo Arjuna Kalyanam Review

టెక్నికల్ పరంగా చూస్తే…
డైరెక్టర్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతేకాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా కథను చూపించాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సంగీతం మాత్రం బాగా హైలెట్ గా మారింది.

విశ్లేషణ…
ఈ సినిమాకు దర్శకుడు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించాడు. 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కాకపోవటంతో ఆ బాధను ఎలా పడతారు అనేది బాగా చూపించాడు. అక్కడక్కడ కాస్త స్లో గా అనిపించినా… సినిమా కథ, నటీనటుల పాత్ర, సంగీతం, కామెడీ, సినిమాటోగ్రఫీ, సెకండాఫ్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి.

ఫైనల్ గా…
ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ లో చూడవలసిన సినిమా. ఆలస్యంగా పెళ్లి చేసుకునే వాళ్లు పెళ్లి కోసం బాధపడుతున్న విషయాన్ని బాగా చూపించాడు దర్శకుడు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అందర్నీ ఆకట్టుకుంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort