రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత అభిమానులను పలకరించడానికి వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు.ఈ చిత్రంలో అంజలి,నివేదా థామస్,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్ తమన్ అందిస్తుండగా,వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం అనంతరం పవన్ కళ్యాణ్ ప్యారలల్ గా క్రిష్ దర్శకత్వంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో చిత్రాలు చేయనున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో తాజాగా పవన్ మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి జాయిన్ అయ్యారు.మైత్రి మూవీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.