1929 ఏప్రిల్ 8 తేదీన ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ తో కలిసి కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 – 1931 మార్చి 23) భారత స్వాతంత్య్ర సమర యోధుడు, కరుడుకట్టిన ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవ కారులలో ఆయన ఒకడు. ఆ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా నేటికీ కొనియాడ బడుతున్నాడు.
భగత్ సింగ్ పూర్వపు పంజాబ్‌లో, ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలోని సంధు ఝాట్ కుటుంబంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి దంపతులకు జన్మించాడు. భగత్ అనే పదానికి “భక్తుడు” అని అర్థం. భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు తండ్రి కిషన్ సింగ్, భగత్ సింగ్‌ను చంకకెత్తుకొని, కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరక లను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి “ఏం చేస్తున్నావ్ నాన్నా” అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ” తుపాకులు నాటుతున్నా” అని బదులిచ్చాడు. భవిష్యత్తుకు బాల్యం మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం ఆయన వ్యక్తిత్వానికి మచ్చుతునక.
13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణో ద్యమానికి సింగ్ ప్రభావితుడ య్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు.
లాలా లజ్‌పత్ రాయ్ మరణం, సాండర్స్ హత్యల తరువాత 1928 లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది.
భారత దేశానికి వచ్చిన సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా, ఉద్యమంలో
లాల్‌జీ కీలక పాత్ర వహించి, సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలి అంటూ పంజాబ్ అసెంబ్లీలో ఆయన తీర్మానం పెట్టి గెలిపించారు. ఇది ప్రభుత్వానికి కంటగిం పుగా మారింది. అక్టోబర్ 30, 1928న ఆ కమిషన్ లాహోర్ రాగా, లాల్‌జీ కూడా అహింసతో, మౌనం గా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మౌనంగా ఉద్యమి స్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెం డెంట్ జేమ్స్ ఏ స్కాట్. తను స్వయంగా లాల్‌జీ మీద దాడి చేసి, లాల్‌జీ ఛాతీ మీద లాఠీ తో స్కాట్ తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలతోనే లాల్‌జీ నవంబర్ 17న చని పోయారు.
ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చు కోవాలని నిర్ణయించు కున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హత మార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్, సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ జే. పీ. సాండర్స్ కనిపించినప్పుడు పొర పాటుగా స్కాట్ అనుకుని, జైగో పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంటపడకుండా ఉండటానికి భగత్ లాహోర్ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.
భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం కోసం భారత రక్షణ చట్టమును తీసుకు రావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. శాసనసభ వసారాపై భగత్ సింగ్‌తో పాటు మరో విప్లవకారుడు 8 ఏప్రిల్ 1929న సింగ్, దత్‌లు బాంబు విసిరి, “ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిస్తు పలు కరపత్రాలను వెదజల్లారు. కేంద్ర అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత, బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం గానీ గాయపడటం గానీ జరగలేదు. తమ వ్యూహంలో భాగంగా ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు సింగ్, దత్ అంగీకరించారు. బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు. వాస్తవానికి బాంబు జనాలకు దూర బాంబు దాడి తర్వాత సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు.
సింగ్ అరెస్టు అనంతరం శాసనసభ పేలుడుపై విచారణ నేపథ్యంలో జే. పీ. సాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు , సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు న్యాయస్థానాన్నే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు.
ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హత మార్చి నందుకు గాను వారికి 1930లో అక్టోబర్ 7వ తేదీని ఈ మరణ శిక్షను ఖరారు చేశారు.
భగత్ సింగ్ సహా ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేసిన తీర్పు వివరాలను 2015లో ప్రచురించారు. ‘Warrant of Execution On Sentence Of Death’ అనే విడుదల చేసిన పత్రంలో 1930 అక్టోబర్ 7వ తేదీన ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చినట్లు స్పష్టంగా ఉంది. 1931, మార్చి 23న ఉరిశిక్ష అమలు చేసినట్లు మరో పత్రంలో వివరాలు ఉన్నాయి.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494