భారత దేశంలో ప్రముఖ కమ్యూనిస్టు నేతల్లో మాకినేని బసవపున్నయ్య ఒకరు. విద్యార్థి సంఘం నేతగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో తొలుత కాంగ్రెస్‌లోనే ఓనమాలు దిద్దుకున్నారు.
అనంతరం కమ్యూనిస్టు భావాలు ఆకర్షించడంతో సీపీఐలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అనంతరం సీపీఎం ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. ఆ క్రమంలో ఆయన అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్టు నేతలైన స్టాలిన్, మాలటోవ్, సుస్లోవ్, మాలెంకోవ్‌లతో చర్చలు జరిపారు. అలాగే చైనా కమ్యూనిస్టు దిగ్గజాలు మావోసేటుంగ్, చౌఎన్‌లైతోనూ పున్నయ్యకు సన్నిహిత సంబంధాలున్నాయి. 1952 నుంచి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. కార్ల్‌మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడ్డ ఆయన జీవితాంతం రాజీ ఎరగని పోరాట యోధునిగా నిలిచి పోయారు.
కామ్రేడ్ బసవ పున్నయ్య రేపల్లె మండం తూర్పుపాలెంలోని భూస్వామ్య కుటుంబంలో 1914 డిసెంబరు 14న జన్మించారు. తల్లిదండ్రలు చారుమతి, అప్పయ్యలకు జన్మించారు. భార్య జగదాంబ. ప్రారంభంలో సాంప్రదాయ విద్య, అనంతరం ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివి, బందరు నోబుల్ కళాశాలో ఇంటర్మీడియట్, గుంటూరు ఎ.సి. కాలేజీలో బి.ఎ.పూర్తి చేశారు 1930లో దేశస్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన నాటి తరం నేతలతో కలిసి పనిచేసి అనుభవాు పంచుకున్నారు.
ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం ఉద్యమాన్ని తాత్కాలికంగా రద్దు చేయటంతో అసంతృప్తి చెందిన బసవ పున్నయ్య భారతదేశ ప్రజ సమస్య సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే పరిష్కారం కాగవన్న విశ్వాసంతో 1934 -35లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గుంటూరులో జరిగిన విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించి, సహ విద్యార్థులైన వై.వి.కృష్ణారావు, మాద నారాయణ స్వామి, మోటూరు హనుమంత రావు, లావు బాగంగాధర రావుతో కసి రాష్ట్రంలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి, 1938లో ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా, అదే సమయంలో అభిల భారత విద్యార్థి ఫెడరేషన్ సహాయ కార్యదర్శిగా పనిచేశారు. 1940లో గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా బాధ్యతను స్వీకరించారు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుగా ఎన్నికైనారు.1948లో కలకత్తాలో జరిగిన సి.పి.ఐ. ద్వితీయ మహాసభలో కేంద్ర కమీటికి ఎన్నికయ్యారు. 1964లో పార్టీ చీలిన తరువాత సి.పి.ఐ.(ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. ఆ స్థానంలో నాలుగు దశాబ్దాల పాటు తుదిశ్వాస విడిచే వరకూ కొనసాగారు.
మార్క్సిజం లెనినిజంకు చివరి వరకు కట్టుబడి ఉండి పీడిత ప్రజ విముక్తి కోసం విశిష్టమైన సేవందించారు. నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట విశ్లేషణను చేయగలిగిన మార్క్సిజం లెనినిజం అనే సజీవ సిద్ధాంత వ్యాప్తికి, భారతదేశ ప్రజ విముక్తికి గణనీయమైన సేవలందించారు. తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన నాయకులో కామ్రేడ్ మాకినేని ఒకరు. తెంగాణా సాయుధ పోరాటంలో కామ్రేడ్స్ సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు మొదలైన ప్రముఖులతో పాటు కీలక పాత్రను పున్నయ్య పోషించారు. తెలంగాణ పోరాట నిర్వహణకు అవసరమైన నిధుల సమీకరణ, ఆయుధాల కోనుగోలు, చేరవేతలో ప్రధాన భాధ్యత బసవ పున్నయ్యదే.
సాయుధ పోరాటాన్ని విరమించి విప్లవ మార్గాన్ని చేపట్టటంలో సుందరయ్యతో పాటు బసవ పున్నయ్య సృజనాత్మక పాత్ర నిర్వహించారు. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగణ్యులైన నాయకులో ఒకరుగా ఎదిగారు. రహస్య జీవనం సాగించిన సందర్భం, ప్రభుత్వం దమన కాండకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన అనుభవాల సాయంతో భారత దేశంలో విప్లవ సాధనకు అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడపై ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చర్చను ప్రారంభించిన వారిలో ఒకరిగా, సిపిఎం విప్లవకర వ్యూహ్యాన్ని చేపట్టడంలో కామ్రేడ్ బసవ పున్నయ్య కీలక పాత్రధారి.
భారత కమ్యూనిస్టు ఉద్యమంలో సిద్ధాంత పరంగా తీవ్రస్థాయిలో చర్చ సాగిన కాలంలో ఈ అంశంపై అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నాయకులతో చర్చ జరిపే బాధ్యతను పార్టీ కేంద్రకమిటీ కామ్రేడ్ మాకినేనికి అప్పగించింది. మాస్కోలో 1957లో జరిగిన ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో పాల్గోనేందుకు వెళ్ళిన సి.పి.ఐ. ప్రతినిధి వర్గంలో ఆయన సభ్యులు. నాడు దేశంలోనూ, అంతర్జాతీయం గానూ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యపై మావోసేటుంగ్ తోనూ, లీషావ్‌చి నాయకత్వంలో వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందంతోనూ చర్చజరిపే అవకాశం కామ్రేడ్ బసవ పున్నయ్యకు వచ్చింది.
శాస్త్రీయమైన, విప్లవకర మార్క్సిజం లెనినిజం సిద్ధాతం పట్ల ప్రగాఢమైన నిబద్ధతతో కూడిన దేశభక్తి కామ్రేడ్ బసవ పున్నయ్యలో నిండుగా ఉంది. భారత విప్లవ మార్గానికి స్వతంత్ర వ్యూహాలను, ఎత్తుగడలను అన్వేషించి ప్రజలకు విప్లవ మార్గాన్ని సూచించారు. విప్లవ సాధనకు వ్యూహాన్ని రూపొందించేవారు. భారత దేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం సైద్ధాంతికంగా, ఆచరణాత్మకంగా గణనీయమైన కృషి చేస్తూనే పార్లమెంటేరియన్ గానూ రాణించారు. రాజ్యసభ సభ్యుడిగా 1952 నుంచి 1966 వరకు 14 ఏళ్లు కొనసాగారు.
కామ్రేడ్ మాకినేని బసవ పున్నయ్య రాజకీయ జీవితంలో ఆరేళ్లపాటు అజ్ఞాతవాసం సాగించారు. చైనా భారత్ యుద్ధం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను రెండుసార్లు జైల్లో పెట్టింది. ఈ . చైనా భారత దేశాల మధ్య వివాదాన్ని సంప్రదింపులు, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించు కోవాలని, ఘర్షణ ద్వారా కాదని నొక్కి చెప్పారు. సి.పి.ఐ.(ఎం) ఆవిర్భావం నాటి నుంచి చనిపోయే వరకూ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుగా పనిచేసిన కామ్రేడ్ మాకినేని పూర్వపు సోషలిస్టు దేశాల్లో సంభవించిన మార్పుకు సంబంధించి చేసిన సిద్ధాంత పరమైన సూత్రీకరణల్లో క్రీయాశీక పాత్ర నిర్వహించారు.
1990లో సోవియట్ యూనియన్ కుప్పకూలి, సోషలిష్టు సిద్ధాంతం పైనే దాడి కేంద్రీకరించ బడినా సడలని కమ్యునిస్టు విశ్వాసాన్ని నిలిపిన ధీరుడు బసవ పున్నయ్య. సి.పి.ఐ.(ఎం) అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటర్‌గా ఆయన 14 ఏళ్లు పనిచేశారు. సి.పి.ఐ.(ఎం) అభివృద్ధికి, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి వయసుతో నిమిత్తం లేకుండా అవిశ్రాంతంగా కృషిచేశారు. మాకినేని నిరంతరం చదివేవారు, విస్తృతంగా రాసేవారు. కార్యకర్తలు, ఢిల్లీ కార్యాలయం సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవారు.
అందుకే ఆయన్ను అందరూ ఎంతో అభిమానించే వారు. జాతీయ, అంతర్జాతీయ సమస్యలు సైద్ధాంతిక, వ్యక్తిగత సమస్యపై చర్చించేందుకు అయన అందరికీ ఎ్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. బసవ పున్నయ్య గొప్ప ఉపన్యాసకులు. సునిశితమైన రచయితగా అనేక సిద్ధాంత పత్రాలను రచించారు. ఆయనలో మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాత పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయత, దేశభక్తి, తెలుగు జాతీయత కలగలిపి ఉండేవి. విప్లవోద్యమం కోసం కామ్రేడ్స్ సుందరయ్య, రాజేశ్వరరావు మున్నగు వారితో సహా, తమ వ్యక్తిగత ఆస్తులను అమ్మి పార్టీకి ఇచ్చినవారిలో కామ్రేడ్ బసవ పున్నయ్య ఒకరు. కామ్రేడ్ బసవ పున్నయ్య ఢల్లీలోని పార్టీ కేంద్ర కార్యాయంలో పార్టీ పనిలో ఉంటూనే 1992 ఏప్రిల్ 12వతేది సాయత్రం అకస్మాత్తుగా మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494