అట్లూరి పిచ్చేశ్వర రావు (ఏప్రిల్ 12, 1925 – సెప్టెంబర్ 26, 1966), తెలుగు కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత కూడా. పిచ్చేశ్వర రావు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా యందు చౌటపల్లి గ్రామంలో ఏప్రిల్ 12, 1925 న జన్మించారు. ఆయన కుటుంబం సమీప గ్రామమైన పులపర్రు గ్రామానికి వలస పోయింది. చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలో విద్యా భ్యాసం చేశారు. హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచారు. తన ఇంటర్మీడియట్ విద్యను హిందూ కాలేజ్ లో పూర్తి చేశారు. విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరారు. 1948 లో బి.ఆర్.డబ్ల్యూ, కె.సి.జి. పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యారు. 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
పిచ్చేశ్వర రావు, ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి కనిష్ఠ పుత్రికైన చౌద రాణిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా కథా రచయిత్రి, నవలా రచయిత్రి. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించిం ది. ఆమె 1996 లో మరణించింది.
అట్లూరి పిచ్చేశ్వర రావు తెలుగు దినపత్రిక అయిన విశాలాంధ్ర దినపత్రికలో కొంత కాలం పాటు పనిచేశారు. 1962 లో మద్రాసు (ప్రస్తుతం చెన్నై) కు వెళ్ళి చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా స్థిర పడ్డారు. హిందీ భాషలో గల సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశారు. అవి గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు,, గాడిద ఆత్మ కథ. ఆ అనువాదంలో భాగంగా, అనేక కథలు, రేడియో నాటికలు, వంటివి రాసాడు. వాటిలో మనసులో మనిషీ ప్రాధాన్యత పొందింది.
“గౌతమ బుద్ద”, “వీరేశ లింగం” అనే స్క్రీప్ట్స్ పిచ్చేశ్వర రావు రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచా యి. అవి తెలుగు భాషలో ప్రసిద్ధమై నవి. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందారు. పిచ్చేశ్వర రావు సెప్టెంబర్ 26, 1966లో గుండె పోటుతో మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494