18వ శతాబ్దంలో జేమ్స్ పార్కిన్ సన్ అనే ఆంగ్లవైద్యుడు ఒళ్ళు ఒణుకు వ్యాధి అనే పేరుతో మొదట దీన్ని నిర్వచించిన కారణంగా పార్కిన్సన్స్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి వేదకాలం లోనే ప్రస్తావించ బడింది. ఆయుర్వేద సంహితలో అంటే ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రంలో ఈ వ్యాధి, దాని లక్షణాలు, చికిత్స పేర్కొన బడ్డాయి. నాటి వైద్యశాస్త్ర నిపుణులు దీన్ని కంపవాత మన్నారు.
2500 సంవత్సరాలకు పూర్వమే నైజింగ్ (NeiJing) అనే చైనా వైద్యశాస్త్రంలో దీని గురించిన ప్రస్తావన వుంది. కంపవాతం ఆయుర్వేద రీత్యా ఒక నరాల జబ్బు.
ఈ వ్యాధి సోకిన మనిషి కదలికలో వ్యత్యాసం కనిపిస్తుంది. కూర్చొని, పడుకొని ఉన్నంతసేపూ బాగుం టాడు. కాని లేచి నిలబడి కదలబోతే శరీరం వణికి ఇటూ అటూ కదిలి పోతూ పడిపోతుంటాడు.
పార్కిన్సన్ వ్యాధిని ఇప్పటికీ కారణం తెలియని వ్యాధిగానే పరిగణిస్తు న్నారు. జన్యుపరంగా, పర్యావరణ కారణాలవల్ల ఈ వ్యాధి వస్తుంది. పర్యావరణ కాలుష్యం విషపదార్థాలు, ఎరువులు, డ్రగ్స్ (యాంటీ సైకోటికో, వాంతి వచ్చే మందులు) తయారీ, తరచుగా తలనొప్పి తదితర కారణాలతో పార్కిన్సన్ వ్యాధి ముడిపడి ఉంది. మెదడులో ఉత్పన్నమయ్యే డోపమైన్ కణాలు తగ్గిన పక్షంలో ఈ వ్యాధి వచ్చినట్టు నిర్ధారణ చేసుకోవచ్చు. ప్రొటీనోపతి (ప్రోటీన్లకు సంబంధించిన రుగ్మత) వల్ల పార్కిన్సన్ వ్యాధివచ్చే అవకాశముంది. పార్కిన్సన్ వ్యాధి సర్వసాధారణ వ్యాధి. ఇది సమాజంలో ప్రబలంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఇది వస్తుంది. దీన్ని వృద్ధాప్యంలో వచ్చే అంగవైకల్య వ్యాధిగా పరిగణిస్తారు.
“వణుకుడు రోగం” లేక “పార్కిన్సన్స్ వ్యాధి” నాడీ కణాలను (నరాల కణాలను) దెబ్బ తీయడం ద్వారా ప్రగతిశీల మెదడు దెబ్బకు దారితీస్తుంది. ‘డోపమైన్’ అని పలవబడే న్యూరోట్రాన్స్మిటర్ ద్వారా మెదడు అంతటా సంకేతాలు ప్రసరించే బాధ్యత ఈ నాడీ కణాలదే. సాధారణ పరిస్థితులలో, మృదువైన, సమతుల్య కండరాల సమన్వయాన్ని డోపమైన్ సహాయంతో సాధించవచ్చు. ఈ డోపామైన్ అనే ఈ న్యూరోట్రాన్స్మిటర్ లేకపోవడం మూలంగానే “పార్కిన్సన్స్ వ్యాధి” లేక వణుకుడు రోగం మనుషుల్లో సంభవిస్తుంది.
పార్కిన్సన్స్ వ్యాధి యొక్క ప్రారంభ మరియు అత్యంత సాధారణ లక్షణాలు శరీరంలోని అవయవాల్లోని ఎదో ఒక భాగంలో… చేతులు లేదా కాళ్ళు లేదా దవడ లోనైనా, వణుకుడు రావడం. చేయి విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ప్రకంపన లేదా వణుకు సాధారణంగా గుర్తించ బడుతుంది, సాధారణంగా చూపుడు వేలుకు వ్యతిరేకంగా బొటనవేలు యొక్క కదలికను చూడవచ్చు.
దీని రెండవ లక్షణం సాధారణంగా కండరాల పెడసరం లేదా కండరాలు బిగదీయడం. మనిషి స్వేచ్చా చలన వలయాల్ని కుంటుపరుస్తూ (పరిమితం చేస్తూ) అనియంత్రితమైన కండరాల పెడసరం లేక కండరాలు పట్టేయడ మనేది వణుకుడు వ్యాధి లక్షణం. వ్యాధికి గురైన వ్యక్తులు చేపట్టిన ఏధైనా పనియొక్క వేగంలో క్రమమైన తగ్గుదలను చూపుతారు. స్నానం లేదా తినడం వంటి సాధారణ కార్యకలాపాల్ని పూర్తి చేయడంలో కూడా వీళ్ళు అసాధారణంగా ఎక్కువసేపు తీసుకోవాల్సి వస్తుంది.
సాపేక్షంగా అరుదుగా ఉండే లక్షణాలలో భయము, చొంగ కార్చడం, చర్మ సమస్యలు, మూత్ర సమస్యలు, లైంగిక అసమర్థత ఉంటాయి. వ్యాధి బాధితుడి వణుకుడు గణనీయంగా సదరు వ్యక్తి మాటల్ని మరియు చేతివ్రాతను దెబ్బ తీస్తుంది.
వణుకుడు రోగానికి సంభావ్య కారణాలను గుర్తించడానికి పరిశోధన కొనసాగుతున్నప్పటికీ, అదిప్పటికీ తెలియదు. జన్యు కారకాలు మరియు కొన్ని పర్యావరణ పరిస్థితుల్ని వణుకుడు జబ్బుకు ప్రమాద కారకాలుగా భావిస్తారు.
పార్కిన్సన్స్ వ్యాధిని అభివృద్ధి చేయడంలో జన్యు పరివర్తనలు ప్రమాద కారకంగా గుర్తించ బడ్డాయి, యాంటిసైకోటిక్ ఔషధాలను సేవించే వ్యక్తులు లేదా మెదడు అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో లేదా గతంలో స్ట్రోక్ లకు గురై బాధపడుతున్న వ్యక్తులకు వణుకుడు రోగం సంభవించ వచ్చునని భావించ బడుతోంది.
పరిస్థితిని నిర్ధారించడానికి నిర్దిష్ట రక్తం లేదా ప్రయోగశాల పరిశోధన లేనందున పార్కిన్సన్స్ వ్యాధి నిర్ధారణను గందరగోళంగా చెప్పవచ్చు. అంతే కాకుండా, లక్షణాలు తరచూ కీళ్ళ అసాధారణతలు లేదా విటమిన్ లోపాల వంటి ఇతర రుగ్మతలను అనుకరిస్తాయి.
ఒక అర్హత కలిగిన న్యూరాలజిస్ట్ తో సలహా, సంప్రదింపులు తీసుకోవాలి. ఈ న్యూరాలజిస్ట్ కొంతకాలం పాటు లక్షణాలను పరిశీలించి, వ్యాధి పురోగతిని ఆపడమే లేక నియంత్రించడమో చేయగలరు.
చికిత్సకు సంబంధించినంత వరకు, ‘డోపమైన్’ లోప పరిస్థితికి వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు వ్యాధికి గురైన మెదడు బాగాలను ప్రేరేపించడం ద్వారా పని చేస్తాయి. అయితే, దీర్ఘకాలిక దశలో, ఈ మందులు దుష్ప్రభావాలను చూపుతాయి.
మందులు వ్యాధి లక్షణాలను నియంత్రించ లేకుంటే, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మెదడును ప్రేరేపించటానికి ఎలక్ట్రోడ్లు ఉపయోగించడం ఇందులో జరుగుతుంది, ఇలా చేయడం ద్వారా వణుకుడ్ని ప్రేరేపించడానికి దారితీసే ప్రేరణల్ని అడ్డుకోవడం జరుగుతుంది.
పార్కిన్సన్స్ వ్యాధి ఒక ప్రగతిశీల రుగ్మత. ఈ రుగ్మతకు ఖచ్చితమైన నివారణ లేదు. మానసిక ఆరోగ్యాన్ని, శారీరక చర్యల్ని చేపట్టే సామర్త్యాన్ని కాపాడు కోవడమే ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల దీర్ఘకాలిక లక్ష్యాలుగా ఉండాలి.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494