స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
మాస్ లుక్ లో కనిపిస్తున్న అల్లు అర్జున్ కు జంటగా ఈ మూవీలో రష్మిక మందన్న నటిస్తుంది.సునీల్,అనసూయ భరధ్వాజ్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ షాట్ లోకి మరో హీరోయిన్ ప్రవేశపెట్టే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ మేర తమిళ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో బన్నీ చెల్లి పాత్రలో కనిపించబోతుందట.ఈమె పవన్ కళ్యాణ్,రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ లో కూడా హీరోయిన్ గా చేస్తుంది.ఇలా తెలుగులో వరసగా క్రేజీ ప్రాజెక్ట్ లు సైన్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ ఇంకెన్ని ప్రాజెక్ట్స్ లను తన ఖాతాలో వేసుకుంటుందో వేచి చూడాల్సివుంది.