టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై చెప్పులతో, రాళ్లతో దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన వ్యక్తి రైతు కాగా, రాళ్లు విసిరిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి తాను నష్టపోయినట్లుగా చెబుతున్నారని పోలీసులు తెలిపారు. చంద్రబాబు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అందుకే అలా చేశానని వారు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. డీజీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాజకీయ కామెంట్లపై తాము మాట్లాడమని అన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తమ విచారణలో పెద్దగా వివాదాలు జరగవని తేలిందని, అందుకే చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చామని తెలిపారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై సమాచారం అందించేందుకు సీఐడి విభాగంలో నూతనంగా వాట్సప్ నెంబర్
అమరావతి : 7382296118 నెంబర్ ను ప్రారంభించిన డీజీపీ గౌతమ్ సవాంగ్..
డిజిపి గౌతమ్ సవాంగ్ …
గంజాయి, మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, అమ్మకాల సమాచారాన్ని వాట్సప్ ద్వారా నార్కోటిక్ సెల్, సీఐడీ కి తెలియజేయవచ్చు
ఖచ్చితమైన సమాచారాన్ని అందించినవారికి పారితోషకం అందజేస్తాం
ఎపి ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దడం లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలి
సమాచారం అందించినవారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాము
మాదక ద్రవ్యాల వినియోగం ఇటీవల పెరిగింది
విద్యార్ధులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు
యూనివర్సిటీ, కలశాలల వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి
విద్యా సంస్థల్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహించేలా చూస్తాం
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మత్తు పదార్థాల కు బానిస కాకుండా గమనిస్తూ ఉండాలి
ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువగా గంజాయి రవాణా అవుతుంది
విజయనగరం, విశాఖ, తూ.గో జిల్లాల్లో గంజాయి సాగు జరుగుతుంది
పోలీసులు తో పాటు, ఎక్సైజ్, మరికొన్ని శాఖల అధికారులతో సెమినార్లు నిర్వహించాం