Wednesday, November 30, 2022
HomeLifestyleDevotionalఅమలైకాదశి ప్రాశస్త్యం

అమలైకాదశి ప్రాశస్త్యం

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
హిందూ దేశంలో ఏటా జరుపుకునే పబ్బాలలో, పండగలలో ఒక్కొక్కనాడు ఒక్కో వృక్ష పూజ ఆచరణలో ఉంది. బిల్వపత్రం, శమీ వృక్షం, ఆమ్రపుష్పం, అలాగే అమలక ఫల విని యోగం చేయడం సాంప్రదాయసిద్ధంగా వస్తున్నది. కార్తీకం నుండి చైత్రం వరకు ఆరు మాసాలలో అమలకిని పచ్చి దానిని ఏదో విధంగా వాడాలని పెద్దల నిర్దేశం. ఏడాదిలో వచ్చే ఏకాదశులు విష్ణువు చర్యలను బట్టి శయ నైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి; వ్రత నియమాలను బట్టి నిర్ణలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి ఏర్పడగా, ఒక “పండు” (ఉసిరిక)తో సంబంధించి ఏర్పడింది ఒక్క అమలకి ఏకాదశి మాత్రమే. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు అమలకీ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈ రోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు. విష్ణు మూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాదు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాస ముంటారని ప్రతీతి. రాధా కృష్ణులు కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెపుతున్నాయి.

స్మృతి కౌస్తుభం, కృత్యసార సముచ్చయం, తిధితత్వం మున్నగు గ్రంథాలు కార్తీక మాసంలో అమలకి వృక్ష మూలాన ఉసిరిక కాయలతో, ఉసిరిక పత్రితో దైవారా ధన చేయాలని, తులసితో పాటు కాయతో కూడిన ఉసిరిక కొమ్మను పూజించాలని, ఉసిరిక చెట్టు నీడన అన్నం వండాలని, ఉసిరిక పండ్లు కలిపిన నీటితో స్నానం చేయాలని, పూర్ణిమ నాడు ఉసిరిక ఫల దానం చేయాలని, శిరస్సు, ముఖం హస్తం, దేహమందు ఉసిరిక పండు ధరించా లని వివరిస్తున్నాయి.

ఉసిరిక చెట్టు నీడ సోకే కొలనులో స్నానం చేయాలని, ఉసిరిక మాని కింద అరుగుమీద ఆవాసం, పూజ, భోజనం చేయాలని పెద్దల ఉవాచ, అలాగే ఫాల్గున మాసంలో మళ్ళీ ఉసిరిక వినియోగం ఉంది. “అమలకే వృక్షే జనార్ధనః” అని అమదేర్ జ్యోతిషి మున్నగు గ్రంథాలు పేర్కొంటున్నాయి. అమ లక వృక్షం జనార్ధన స్వరూపమని, దాని కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు అమలకీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి తెలుపుతున్నది. సంస్కృతంలో అమలకానికి గల
పర్యాయ పదాలు…అమలకం గుణమును ధరించునది; ధాత్రి – దాది వంటిది; వయస్థ – వయస్సున నిలుపునది; ఫలరవ – సారవంత మైనది. అమృత – అమృతం వంటిది. శీతఫలి – శీతవీర్యము కలది. ప్రాణమును నిలుపునది కనుక ఉసురుకాయ అనునది సార్ధక నామ మని కొందరి భావన.

ఒక పేద ఇల్లాలు ఉసిరికాయలు భిక్ష పెట్టగా, ఆది శంకరులు కనక ధారాస్తవం చెప్పి బంగారు ఉసిరి కాయల వర్షం కురిపించారని చెపు తారు. ఇక వైద్యోపయోగానికి వస్తే… షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు దీనిలో ఉన్నాయి. ఇది మహత్తర ఓషధీ గుణం కలది. అమృతా ఫలమనే గ్రంథంలో దాని ఔషధీ గుణాలు, ఫల జాతులు గ్రంథంలో సర్వాంగా ల యొక్క వైద్య, పారిశ్రామిక ఉపయోగాలు, వాగ్భటంలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్స ఉపయోగాలు విపులీకృతమై ఉన్నాయి.

“కరతలామలకము” అనే సామెత తెలియని వారుండరు. అనగా అరచేతిలోని ఉసిరి కాయ. ప్రాచీన ఆర్యజ్యోతిర్విద్వాంసులు ఉసిరి కాయను భూగోళమునకు ఉపమగ చూపించారు. అంటే అరచేతి అమలకము వలె గోళ సర్వస్వము ను తెలుసుకున్న వారైనట్లు చెప్పారు. విషయ పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంటే కరతలామ లకమనే సామెతను ఉపయోగి స్తారు. సర్వ ప్రపంచ సదృశమై, భగవత్ స్వరూపమై ఉన్నందునే అమలకము దానము నకు ముఖ్యముగా వ్యవహరించ బడుతున్నది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments