స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తుంది.ఈ చిత్రం అనంతరం బన్ని దర్శకుడు కొరటాల శివతో ఓ చిత్రం చేయనున్నారు.ఆ చిత్రం షూట్ స్టార్ట్ అవ్వకముందే బన్ని మరో చిత్రాన్ని లైన్ లో పెట్టాడు.ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు.
ఇక వివరాలలోకి వెళ్తే లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్ అయిన గౌతమ్ మీనన్ తాజాగా బన్నికి ఓ కథను చెప్పేరంట అది బన్నికి బాగా నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఈ సినిమాలో బన్ని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.గతంలో బన్ని రేసు గుర్రం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.ఎప్పుడూ మాస్ సినిమాలు చేసే బన్ని ఈసారి కొంచెం కొత్తగా కనిపించడం కోసం కొరటాల శివ,గౌతమ్ మీనన్ లతో చిత్రాలు చేస్తున్నాడని సమాచారం.
అలాగే ఈ ఏడాది బన్ని బాలీవుడ్ లో ఎంటర్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట అందుకే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను కూడా ప్రారంభించారని ఫిల్మ్ సర్కిల్స్ ఓ వార్త చక్కెర్లు కొడుతుంది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సివుంది.బన్నికి సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.అందుకే గతంలో కూడా బన్ని బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి.