స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తుంది.ఈ చిత్రం అనంతరం బన్ని దర్శకుడు కొరటాల శివతో ఓ చిత్రం చేయనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం.
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో మన స్టైలిష్ స్టార్ బన్నికి తండ్రిగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారట.ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నారు. గతంలో మోహన్ లాల్ , కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో నటించారు.బన్నికి మలయాళం మంచి క్రేజ్ ఉంది ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన్ని ఈ చిత్రంలోకి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించింది.అందుకోసం ఒక కొత్త ఆఫీస్ ను కూడా తీశారట.
పుష్ప రిలీజ్ అనంతరం ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నది.ఈ చిత్రాన్ని 2022 సమ్మర్ కు తీసుకుని రావాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.