5.1 C
New York
Saturday, March 25, 2023
HomeEntertainmentMovie Updatesఆకాష్ పూరీ "చోర్ బజార్"

ఆకాష్ పూరీ “చోర్ బజార్”

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు యువ హీరో ఆకాష్ పూరీ తన మూడో చిత్రాన్ని కన్ఫర్మ్ చేశారు. “జార్జ్ రెడ్డి” చిత్రంతో విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి ఇన్ స్ఫైరింగ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆకాష్ పూరీ, జీవన్ రెడ్డి కాంబినేషన్ చిత్రానికి “చోర్ బజార్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్ కు చేరుతుంటాయి. అయితే ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు.

“చోర్ బజార్” సినిమా గురువారం  హైదరాబాద్ లోని ప్రొడక్షన్ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో ఆకాశ్ పై సోదరి పవిత్ర పూరి క్లాప్ ఇవ్వగా తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఐ.వి ఎస్.ఎన్ రాజు ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్క్రిప్ట్ ను అందించారు. వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” చిత్రంలో సుబ్బరాజు, పోసాని,  “లేడీస్ టైలర్” ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. “చోర్ బజార్” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.

సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – సత్య గిడుటూరి, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, మేకప్ – శివ, కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి, కాస్ట్యూమ్ చీఫ్ – శ్రీనివాస్, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను, పబ్లిసిటీ డిజైనర్ – సుధీర్, పీఆర్వో – జీఎస్కే మీడియా, డిజిటల్ మీడియా – టాక్ స్కూప్, బ్యానర్ – వీ ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.
Akash Puri’s ‘Chor Bazaar’ with ‘George Reddy’ director Jeevan Reddy

Dashing director Puri Jagannadh’s son Akash Puri has confirmed his third film. ‘George Reddy’ fame Jeevan Reddy will be directing the movie and the title is confirmed as ‘Chor Bazaar.’
The film went for a formal launch this morning in Hyderabad. Akash Puri’s sister Pavitra clapped the sound board while Puri Jagan’s wife Lavanya switched on the camera. IVSN Raju directed the first shot and Raju Munnangi handed over the script.
VS Raju will be producing ‘Chor Bazaar’ on V Productions banner and this is the producer’s maiden project.
Actor Subbaraju, Posani Krishna Murali and Acharna of ‘Ladies Tailor’ fame are going to play key roles in this movie. The regular shooting will kick start from February 26th.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments