5.1 C
New York
Saturday, June 3, 2023
HomeNewsAfter 52 days, Telangana RTC strike called off by employee unions_Ts360news

After 52 days, Telangana RTC strike called off by employee unions_Ts360news

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.

రేపటి నుంచి కార్మికులందరూ డ్యూటీలకు హాజరుకావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఇదే విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు..

కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్యం నుంచి కనీసం స్పందన రాలేదని అన్నారు.

ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించిందన్నారు. ప్రభుత్వ నిర్బంధకాండ మధ్య నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు.


అధికారులు కొంతమంది ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దానిని అడ్డుకోవాలన్నారు.

సమ్మె విరమించినా నైతిక విజయం కార్మికులదేనని అన్నారు. కార్మికులు ఓడిపోలేదని, ప్రభుత్వ గెలవలేదని పేర్కొన్నారు.

హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం లేబర్ కోర్డుకు వెళ్లాల్సి ఉందన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మికులందరూ విధులకు హాజరవ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు.

సెకండ్ షిప్ట్ వాళ్లు కూడా విధులకు రావాలన్నారు. ఇన్ని రోజులు బస్సులు నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటి నుంచి డ్యూటీలకు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేశారు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments